ఉపాధ్యాయుల్లో బదిలీల సందడి
🌼గుంటూరు
❇️ఉపాధ్యాయుల బదిలీల కల సాకారం కానుంది. మూడేళ్ల సుదీర్ఘ విరామం అనంతరం బదిలీల ప్రక్రియ జరగనుంది. ప్రభుత్వ పాఠశాలల్లో పని చేస్తూ బదలీలకి నోచుకోకుండా ఏళ్ల తరబడి మారుమూల ప్రాంతాల్లో మగ్గుతున్న ఉపాధ్యాయుల విజ్ఞప్తులపై స్పందించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సాధారణ బదిలీలకు ఆమోదం తెలిపారు.
❇️దీంతో బదిలీల షెడ్యూల్ విడుదల చేసేందుకు విద్యాశాఖ ఉన్నతాధికారులు చర్యలు చేపట్టారు.
❇️రెండు రోజుల్లో షెడ్యూల్ విడుదల కానుందని అధికారులు చెబుతున్నారు.
❇️నవంబర్ 2న పాఠశాలలను పునఃప్రారంభించేందుకు చర్యలు చేపడుతున్న నేపథ్యంలో ఆలోగానే ఉపాధ్యాయ బదిలీలు పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.
❇️2017 జూలైలో జరిగిన ఉపాధ్యాయ బదిలీల కౌన్సెలింగ్ తరువాత మళ్లీ బదిలీలు జరగలేదు. ఒకే పాఠశాలలో ఎనిమిదేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న ఉపాధ్యాయులు తప్పని సరిగా బదిలీ కావాల్సి ఉంది. రెండేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న ఉపాధ్యాయులు పరస్పర బదిలీలకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉంది.
❇️జిల్లాలోని గుంటూరు, తెనాలి, బాపట్ల విద్యా డివిజన్ల పరిధిలోని పాఠశాలలకు బదిలీపై వెళ్లేందుకు ఉపాధ్యాయులు ఆసక్తి చూపుతున్నారు.
❇️పల్నాడు ప్రాంతానికి చెందిన మారుమూల మండలాల పరిధిలోని పాఠశాలల్లో పని చేసేందుకు విముఖంగా ఉంటున్నారు. ఈ పరిస్థితుల్లో ఏటా సాధారణ బదిలీలను నిర్వహించడం ద్వారా ఒకే ప్రాంతానికి పరిమితమైన ఉపాధ్యాయులను వేరొక ప్రాంతానికి పంపించడం
ద్వారా ఉపాధ్యాయులందరికీ సమ ప్రాధాన్యతను ఇచ్చి సమన్యాయం చేసినట్లవుతుంది.
🍁2,700 మందికి బదిలీ తప్పనిసరి
❇️ఒకేచోట ఎనిమిదేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న ఉపాధ్యాయులు జిల్లాలో 2,700 మంది వరకు ఉన్నారు. రెండేళ్ల సర్వీసు పూర్తి చేసుకుని ఇతర ప్రాంతాలకు పరస్పర,రిక్వెస్ట్ బదిలీ కోరుకునే వారు మరో 1,500 మంది వరకు ఉంటారని అధికారులు అంచనా వేస్తున్నారు.
❇️కోవిడ్-19 దృష్ట్యా వందలాది మంది ఉపాధ్యాయులకు భౌతికంగా కౌన్సెలింగ్ నిర్వహించే పరిస్థితులు లేకపోవడంతో వెబ్‌కౌన్సెలింగ్ ద్వారా ఆన్లైన్లో బదిలీల ప్రక్రియ చేపడుతున్నారు.
❇️బదిలీల పుణ్యమా అని జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న పోస్టులు పూర్తిస్థాయిలో భర్తీ కాబోతున్నాయి.
❇️ఉద్యోగ విరమణలతో ఖాళీ అయిన పోస్టులతో పాటు రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగంలో చేపట్టిన సంస్కరణల ఫలితంగా ఏకోపాధ్యాయ పాఠశాలలకు అదనంగా మంజూరు చేసిన ఉపాధ్యాయ పోస్టు భర్తీ చేసేందుకు అవకాశం కలిగింది.
❇️ఈ విధంగా జిల్లాలోని
ప్రభుత్వ, జెడ్పీ, మండల పరిషత్ ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలకు విద్యాబోధనకు అవసరమైన విధంగా, అన్ని సబ్జెక్టులకు పూర్తిస్థాయిలో ఉపాధ్యాయులు అందుబాటులోకి రానున్నారు.
0 comments:
Post a comment