Polycet OC And BC Candidates: ఏపీ విద్యార్ధులకు రాష్ట్ర ప్రభుత్వం ఊరటను ఇచ్చింది. 'పాలిసెట్'లో అర్హత మార్కులను తగ్గిస్తున్నట్లు కీలక ప్రకటన చేసింది. ప్రస్తుతం బీసీ, ఓబీసీ విద్యార్ధులకు 30 శాతం అర్హత మార్కులు ఉండగా.. దాన్ని 25 శాతానికి తగ్గిస్తూ స్కిల్ డెవల్‌పమెంట్ అండ్ ట్రైనింగ్ డిపార్ట్మెంట్ స్పెషల్ సీఎస్ జి.అనంతరాము ఉత్తర్వులు జారీ చేశారు.
ఎంసెట్, ఈసెట్లలో 25 శాతమే కనీస క్వాలిఫైయింగ్ మార్కులు ఉండటం వల్ల ఈ మేరకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అలాగే ఎస్సీ, ఎస్టీ విద్యార్ధులకు ఎలాంటి అర్హత మార్కులు అవసరం లేదని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. మరోవైపు రాష్ట్రంలో ఉన్న 6 పాలిటెక్నిక్ కాలేజీల్లో ఈ సంవత్సరం నుంచి ఒకేషనల్ డిప్లొమా కోర్సులను ప్రారంభించేందుకు అనుమతులు మంజూరు చేసింది.
0 comments:
Post a comment