🔳బడిలో కలకలం
కరోనా బారిన పడుతున్న విద్యార్థులు
గంట్యాడ ఘటనతో వెలుగులోకి
యంత్రాంగం అప్రమత్తం
బడి పిల్లలపై కరోనా పంజా విసురుతోంది. జిల్లాలో కరోనా కేసులు తగ్గుతున్నాయనుకుంటున్న సమయంలో విద్యార్థులు వైరస్ బారిన పడుతుండడంతో ఆందోళన కలిగిస్తోంది. శనివారం గంట్యాడ జడ్పీ ఉన్నత పాఠశాలలో 18 మందికి కరోనా సోకినట్లు వెల్లడైంది. దీంతో యంత్రాంగం అప్రమత్తమైంది. అయితే జిల్లాలోని పలు ఇతర పాఠశాలల్లోనూ కేసులు నమోదైనా గోప్యంగా ఉంచుతున్నారంటూ విద్యాశాఖ తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
విజయనగరం విద్యావిభాగం, గంటస్తంభం, రింగ్‌రోడ్డు, న్యూస్‌టుడే: జిల్లాలో 9, 10 తరగతుల విద్యార్థులకు సెప్టెంబరు 21 నుంచి తరగతులు నిర్వహిస్తున్నారు. తల్లిదండ్రుల అంగీకారంతోనే వారు హాజరయ్యేలా చర్యలు తీసుకున్నారు. ప్రసుత్తం 37 శాతం మాత్రమే హాజరు నమోదవుతోంది. కొన్ని చోట్ల ఉపాధ్యాయులు తరగతులు నిర్వహించడంతోనే ఈ పరిస్థితి తలెత్తినట్లు ఆయా వర్గాలు బాహాటంగానే పేర్కొంటున్నాయి. గంట్యాడ మండలంలోని రామవరం ఉన్నత పాఠశాలలో ఇలా తరగతుల నిర్వహణ విషయమై ఉపాధ్యాయులు ప్రధానోపాధ్యాయుడి మధ్య వివాదం చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ పాఠశాలను ఎమ్మెల్సీ పాకలపాటి రఘువర్మ సందర్శించి వివరాలు కూడా తెలుసుకొన్నారు. విద్యార్థులందరికీ కరోనా నిర్ధారణ పరీక్షలు చేయాలనే డిమాండ్ వస్తోంది.
కొన్ని పాఠశాలల్లో..
దత్తిరాజేరు మండలం దత్తి జడ్పీహెచ్ఎస్లో తొమ్మిది మంది విద్యార్థులకు పాజిటివ్ అని తేలింది. కొందరి ఫలితాలు రెండ్రోజుల ముందే తెలిసినా బయటపెట్టలేదు.
నెల్లిమర్ల మండలం రామతీర్థాలు, కొండవెలగాడ పాఠశాలల్లో ఇద్దరు చొప్పున కరోనా బారిన పడ్డారు.
అలజంగి పాఠశాలలో ఒకరికి పాజిటివ్ వచ్చింది.
బాడంగి మండలం కోడూరులో ఇద్దరు ఉపాధ్యాయులు కరోనా బారిన పడటంతో విద్యార్థులకు పరీక్షలు నిర్వహించారు. నివేదికలు రావాల్సి ఉంది.
అనుమతి ఉంటేనే తెరవాలి
ఇకపై పాఠశాలలు తెరవాలనుకుంటే డీఎంహెచ్‌వో అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని కలెక్టర్ ఎం.హరిజవహర్‌లాల్ డీఈవోకు ఆదేశాలు జారీ చేశారు. ఆయా ప్రాంతాల్లో కరోనా కేసుల పరిస్థితి, పాఠశాలలు తెరిచేందుకు అనుకూలంగా ఉన్నదీ లేనిదీ పరిశీలించి అనుమతులిస్తారని పేర్కొన్నారు.
నిబంధనలెక్కడ...?
థర్మల్ స్క్రీనింగ్ ద్వారా విద్యార్థుల శరీర ఉష్ణోగ్రతలు పరీక్షించాలి. ప్రభుత్వం పాఠశాలలకు వీటిని సరఫరా చేయలేదు. సొంతంగా కొనుగోలు చేయాల్సి ఉండడంతో చాలాచోట్ల వీటిని వినియోగించడం లేదు.
ప్రభుత్వం అందించిన మాస్కులు కొన్నిచోట్ల అందలేదని ఉపాధ్యాయులే చెబుతున్నారు
ఎవరికీ లక్షణాలు లేవు..
‘‘గంట్యాడ మండలంలో పాజిటివ్‌గా తేలిన విద్యార్థుల్లో ప్రస్తుతం ఎలాంటి వైరస్ లక్షణాలు లేవు. వారందరినీ ఇళ్లలోనే ఉంచి చికిత్స అందిస్తాం. ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. జిల్లా ఆసుపత్రిలోనూ 20 పడకలు సిద్ధంగా ఉంచాం. ఈ పాఠశాలలో విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని తెలుసుకోవడానికి 79 మందికి పరీక్షలు చేశాం. 18 మందికి పాజిటివ్ అని తేలింది.’ - ఎం.హరిజవహర్‌లాల్, కలెక్టర్
తరగతులు వద్దని చెప్పాం
‘‘పాఠశాలల్లో కేసులు వస్తున్నాయి. ఇప్పటి వరకు ఉపాధ్యాయులు నా దృష్టికి తీసుకురాలేదు. ఇప్పుడే ఇవన్నీ వచ్చినట్లు చెబుతున్నారు. ఇలాంటివి పునరావృతం కాకుండా చూస్తాను. ఉన్నతాధికారులను సంప్రదించి తగు చర్యలు తీసుకుంటాం. తరగతులు నిర్వహించకూడదని, సందేహాలను నివృత్తిచేసి పంపించాలని ఆదేశించాం.’’ - జి.నాగమణి, జిల్లా విద్యాశాఖాధికారిణి.
అందరికీ పరీక్షలు చేస్తాం
‘‘గంట్యాడ మండలంలో కొవిడ్ బాధితుల సంఖ్య ఎక్కువగా ఉంది. విద్యార్థుల తల్లిదండ్రులు, ఇతర కుటుంబ సభ్యులకూ పరీక్షలు చేస్తాం. పిల్లలను కేంద్రాసుపత్రికి తరలించాలనుకున్నాం.. వారి తల్లిదండ్రులు హోం ఐసోలేషన్‌లోనే ఉంటామంటున్నారు. దీనిపై ఉన్నతాధికారులతో చర్చించి నిర్ణయం తీసుకుంటాం.’’ - ఎస్వీ రమణకుమారి, డీఎంహెచ్‌వో

0 comments:
Post a comment