Himachal Pradesh Atal Tunnel: ప్రపంచంలోనే అతి పెద్ద సొరంగం ఇండియాలోనే ఉందంటే... అది మనకో రికార్డే. హిమాచల్ ప్రదేశ్... రోహ్తాంగ్లో ఉన్న ప్రపంచంలోనే అతిపెద్ద పొడవైన అటల్ టన్నెల్‌ను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇవాళ ప్రారంభించనున్నారు. ఆ తర్వాత అందులో ఆయన ప్రయాణిస్తారు. రూ.3,500 కోట్ల ఖర్చుతో... 9.02 కిలోమీటర్ల పొడవుగా నిర్మించిన ఈ టన్నెల్... సముద్ర మట్టానికి 10,213 అడుగుల ఎత్తున ఉంది. మనాలీ నుంచి లాహోల్‌స్పిటి లోయ వరకు దీన్ని నిర్మించారు. దీని వల్ల... మనాలీ నుంచి లఢక్ లోని లేహ్ వరకు 7 గంటల రోడ్డు ప్రయాణ సమయం, 45 కిలోమీటర్ల దూరం తగ్గుతాయి. పైగా... ఇది సొరంగం కావడం వల్ల దీన్లోకి మంచు రాదు.
అందువల్ల దీన్ని ఎప్పుడూ మూసివేయాల్సిన అవసరం రాదు. అంతేకాదు... లఢక్, అక్సాయ్ చిన్ సరిహద్దుల్లో ఉన్న భారత సైన్యానికి ఆయుధాలు, ఆహారం పంపేందుకు ఇది ఉపయోగపడనుంది. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రధానితో కలిసి దక్షిణ ఎంట్రీ నుంచి ఉత్తరం వైపు సొరంగ మార్గంలో ప్రయాణిస్తారు. ఆ తర్వాత మోదీ... దక్షిణ ద్వారం వైపు వెళ్లే హిమాచల్ ఆర్టీసీ బస్సును జెండా ఊపి ప్రారంభిస్తారు. ఇందుకు అన్ని ఏర్పాట్లూ ఆల్రెడీ జరిగాయి.
అటల్ సొరంగం అలా మొదలైంది:
లఢక్ వెళ్లేందుకు ఇన్నాళ్లూ... హిమాచల్ ప్రదేశ్‌లోని రోహతాంగ్ పాస్ వైపు వెళ్లే లేహ్-మనాలీ హైవేను ప్రజలు వాడేవారు. ఐతే... ఇది... సంవత్సరంలో 4 నెలలే తెరిచి ఉంటుంది. మిగతా కాలం మంచుతో మూసి ఉంటుంది. లఢక్ వెళ్లేందుకు మరో మార్గం కూడా ఉంది. అది కాశ్మీరులోని జోజీ లా మీదుగా వెళ్లే శ్రీనగర్-ద్రాస్-కార్గిల్-లేహ్ హైవే. ఇది సంవత్సరంలో 4 నెలలు మూసి ఉంటుంది. ఈ పరిస్థితుల్లో రోహతాంగ్ పాస్ కింద సొరంగం నిర్మించాలన్న ఆలోచన మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజపేయికి వచ్చింది. 2002 మే 26న సొరంగానికి శంకుస్థాపన చేశారు. నిర్మాణం మొదలైంది. గత డిసెంబరులో వాజపేయి 95వ జయంతి సందర్భంగా దీనికి 'అటల్ టన్నెల్' అని పేరు పెట్టారు.
- ఈ సొరంగం నిర్మాణానికి రూ.3,500 కోట్లు ఖర్చైంది. ఆస్ట్రియా టన్నెలింగ్ విధానంలో గుర్రపు నాడా ఆకారంలో నిర్మించారు.
- దీని నిర్మాణానికి 14,598 టన్నుల ఉక్కు వాడారు. 14 లక్షల క్యుబిక్ మీటర్ల మట్టి, రాళ్లను తవ్వారు.
- దక్షిణంవైపు ఎంట్రీ మనాలీకి 25 కిలోమీటర్ల దూరంలో సముద్రమట్టానికి 3,060 మీటర్ల ఎత్తున ఉంది.
- ఉత్తరంవైపు ఎంట్రీ లాహోల్ తెలింగ్ దగ్గర సముద్రమట్టానికి 3,071 మీటర్ల ఎత్తున ఉంది.
- టన్నెల్ 8 మీటర్ల వెడల్పు, 5.525 మీటర్ల ఎత్తు ఉంది. లోపల రెండు వరుసల హైవే ఉంది.
- ప్రతి 60 మీటర్లకు ఒక అగ్నిమాపక వ్యవస్థ, ప్రతి 150 మీటర్లకు ఓ టెలిఫోన్ కనెక్షన్ ఉంది. ప్రతి 500 మీటర్ల వద్ద ఎమర్జెన్సీ డోర్ నిర్మించారు. ప్రతి 2.2 కిలోమీటర్ల దగ్గర గుహలు నిర్మించారు. ప్రతి 250 మీటర్ల దగ్గర మైకు, సీసీటీవీ కెమేరాలు ఉన్నాయి.

0 comments:
Post a comment