ఆంధ్ర ప్రదేశ్ సార్వత్రిక విద్యాపీఠం 2020-21 విద్యా సంవత్సరానికి సంబంధించి పదవ తరగతి మరియు ఇంటర్మీడియట్ ప్రవేశాలకు గడువును 28-10-2020 వరకు పొడిగించడం జరిగింది.ఎటువంటి అపరాధ రుసుము లేకుండా అర్హత కలిగిన అభ్యాసకులు ఇచ్చిన గడువు లోపల అడ్మిషన్స్ పొందవచ్చును.
ఆసక్తి కలిగిన అభ్యాసకులు www.apopenschool.org వెబ్ సైట్ నుండి కానీ సమీప అధ్యయన కేంద్రం నుంచి కానీ ప్రాస్పెక్టస్ ను పొంది జాగ్రత్తగా చదివి తప్పులు లేకుండా మొదట మ్యాన్యువల్ అప్లికేషన్ ని నింపి తర్వాత అభ్యర్థి స్వయంగా www.apopenschool.org వెబ్ సైట్ నందు ఫోన్ నెంబర్ ఆధారంగా రిజిస్ట్రేషన్ చేసుకుని, ఫోన్ నెంబర్ కు వచ్చిన రిజిస్ట్రేషన్ నెంబర్ ను ఉపయోగించి ఆన్లైన్ అప్లికేషన్ను తప్పులు లేకుండా పూర్తి వివరాలను నమోదు చేసి ఫోటో, సంతకం, సంబంధిత ఒరిజినల్ సర్టిఫికెట్లను స్కాన్ చేసి అప్లోడ్ చేసి సబ్మిట్ చేయవలెను. వచ్చిన ప్రింట్ అవుట్ పై అభ్యర్థి సంతకం చేసి అప్లోడ్ చేసిన ఒరిజినల్ సర్టిఫికెట్లు మరియు వాటి జిరాక్స్ కాఫీలను తీసుకొని ఎంపిక చేసుకున్న అధ్యయన కేంద్ర సమయ సమన్వయకర్త కి వాటిని అందజేసి అడ్మిషన్ ను కన్ఫర్మ్ చేయించుకొనవలెను. తర్వాత అభ్యాసకుడు మీసేవ ద్వారా కానీ నెట్ బ్యాంకింగ్ ద్వారా గాని స్వయంగా వెళ్లి అడ్మిషన్ ఫీజు చెల్లించవలెను. అడ్మిషన్ పొందిన ప్రతి ఒక్క అభ్యాసకునికి ఉచిత అధ్యయన సామాగ్రిని అంద చేయబడును. మరియు అధ్యయన కేంద్రం వారు సెలవు దినములలో నిర్వహించే 30 పి సి పి తరగతులకి హాజరుకావలెను. ప్రాక్టికల్ సబ్జెక్టులు కలిగిన అభ్యాసకులకు అదనంగా 20 ప్రాక్టికల్ తరగతులు నిర్వహించబడును. గృహిణిలు, ఉద్యోగస్తులు, రెగ్యులర్ పాఠశాల లో ఫెయిల్ అయిన వారు, వివిధ వృత్తి పనులు చేసుకునేవారు, వివిధ సంఘాల వారికి, ప్రజాప్రతినిధులకు విద్యావంతులు కావడానికి ఇది చక్కటి అవకాశం. అభ్యర్థి తమ సమీపంలోని అధ్యయన కేంద్ర సమన్వయకర్త ద్వారా మరిన్ని వివరాలను పొందవచ్చును. ఈ అవకాశాన్ని అభ్యాసకులు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరడమైనది.
0 comments:
Post a comment