అనంతపురం జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు ఇంటి ఎదుట ఆయన మొదటి భార్య సుజాత ధర్నా చేస్తున్నారు. తనకు న్యాయం చేయకుండానే కలెక్టర్ రెండో వివాహం చేసుకున్నారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో గురువారం ఉదయం అనంతపురం జిల్లా కలెక్టర్ చంద్రుడు నివాసం ఎదుట మాజీ భార్య సుజాత బైఠాయించారు.
విషయం సామాన్య వ్యక్తిది కాకపోవడంతో జరిగిన విషయాన్ని తెలుసుకునేందుకు కలెక్టర్ బంగ్లా లోనికి మీడియాను సైతం పోలీసులు అనుమతించడం లేదు.
మరోవైపు న్యాయం కావాలంటూ మొదటి భార్య సుజాత తన నివాసం వద్ద ధర్నా చేస్తూ ఉండటంతో కలెక్టర్ చంద్రుడు ఎలాగైనా సరే సమస్య నుంచి బయట పడేందుకు కలెక్టర్ చంద్రుడు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. మొదటి భార్య సుజాతతో అనంతపురం కలెక్టర్ గంధం చంద్రుడు రాజీ కుదిర్చే ప్రయత్నాల చేస్తున్నారు.
0 comments:
Post a comment