8 new trains running through Telugu states ..!
గుడ్ న్యూస్.. తెలుగు రాష్ట్రాల మీదుగా నడిచే 8 కొత్త రైళ్లు ఇవే..!
Trains Run Between Telugu States: కరోనా వైరస్ కట్టడి చర్యల్లో భాగంగా రైల్వేశాఖ దేశవ్యాప్తంగా పరిమిత సంఖ్యలో రైళ్లను నడుపుతున్న సంగతి తెలిసిందే. అయితే త్వరలోనే దసరా, దీపావళి పండగ సీజన్ షురూ కానుండటంతో.. జోన్ల వారీగా కొత్తగా మరో 39 ప్రత్యేక రైళ్లను నడపాలని రైల్వేశాఖ నిర్ణయించింది.
ఇదిలా ఉంటే ప్రయాణీకుల సౌకర్యార్ధం దసరా, దీపావళి పండగలను దృష్టిలో పెట్టుకుని 8 కొత్త రైళ్లను దక్షిణ మధ్య రైల్వే ఈ నెల 13 నుంచి పట్టాలెక్కించనుంది. ప్రస్తుతం ఉన్న రైళ్లతో పాటు.. ఈ స్పెషల్ ట్రైన్స్ కూడా తెలుగు రాష్ట్రాల మధ్య ప్రయాణీకులకు సేవలందించనున్నాయి. 13న సికింద్రాబాద్- షాలిమార్, 14న షాలిమార్-సికింద్రాబాద్, 15న విశాఖ-తిరుపతి, 17న సికింద్రాబాద్-విశాఖ, 18న విశాఖ-సికింద్రాబాద్, 25న కాకినాడ-లింగంపల్లి, 26న లింగంపల్లి-కాకినాడ రైళ్లు ప్రారంభం కానున్నాయి.
ఈ రైళ్లతో తెలుగు రాష్ట్రాల ప్రజలకు కాస్త ఊరట లభిస్తుందని చెప్పవచ్చు.
0 comments:
Post a comment