5న జగనన్న విద్యాకానుక
♦కంకిపాడులో ప్రారంభించనున్న సీఎం జగన్
♦విద్యార్థులుకు మూడు జతల దుస్తులు, షూలు
♦విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్
అమరావతి: జగనన్న విద్యా కానుక కార్యక్ర మాన్ని అక్టోబర్ 5న కృష్ణ జిల్లా కంకిపాడు లో రాష్ట్ర ముఖ్య మంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి ప్రారంభించనున్నారని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు శుక్రవారం కంకిపాడులోని జిల్లా పరిషత్ హైస్కూల్, ప్రైమరీ స్కూలును రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమాల కో-ఆర్డినేటర్ తలశిల రఘురాం, విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బి రాజశేఖర్, పెనమలూరు ఎమ్మెల్యే పార్థసారధి, జిల్లా కలెక్టర్ ఎ.ఎండి.ఇంతియాజ్ తో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి ఆదిమూలపు మాట్లాడుతూ, ఈనెల 5న కంకిపాడులో జగనన్న విద్యా కానుక కార్యక్రమాన్ని సీఎం జగన్ లాంఛనంగా ప్రారంభింస్తారని, ఈ కార్యక్రమం కింద పాఠశాల విద్యార్థులకు మూడు జతల బట్టలు, బెల్టు, టై సాక్సులు, షూలను ప్రభుత్వం అందిస్తోందని చెప్పారు నాణ్యమైన విద్యా ప్రమాణాలు అందించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం విద్యా వ్యవస్థ మరింత బలోపేతం చేసిందని మంత్రి స్పష్టం చేశారు. ప్రతి పాఠశాలలో నాడు-నేడు కార్యక్రమం ద్వారా మౌలిక వసతులు కల్పించి, అభివృద్ధి చేస్తున్నామన్నారు. ఈ నాడు-నేడును మూడు విడతలుగాఅమలు చేస్తున్నామని, ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దుతున్నామని చెప్పారు పాఠశాలల అభివృద్ధితోపాటు దశలవారీగా ప్రభుత్వ జూనియర్ కళాశాల, డిగ్రీ కళాశాలలను కూడా నాడు-నేడు కార్యక్రమం కింద అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందని ఆయన పేర్కొన్నారు. అలాగే వచ్చే విద్యా సంవత్సరం నుంచి వైఎస్సార్ ప్రీప్రైమరీ స్కూల్ కార్యక్రమాన్ని అమలు చేయనున్నట్లు ఈ సందర్భంగా ఆయన ప్రకటించారు. పాఠశాల ఆవరణలోనే ఉన్న 1000 అంగన్వాడీ కేంద్రాలను ఈ ప్రీప్రైమరీ స్కూల్ గా అభివృద్ధి చేయబోతున్నామని మంత్రి ఆదిమూలపు వివరించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ మాధవీలత, ఎల్. శివ శంకర్, డీఈవో రాజ్యలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.

0 comments:
Post a comment