ఉద్యోగులకు వేతనబకాయిలెప్పుడో!
లాక్డౌన్లో రెండు నెలలు సగం వేతనాలే
హైకోర్టు ఇచ్చిన గడువు ముగిసి 4 రోజులు
🌻(అమరావతి-ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ ఉద్యోగుల వేతన, పింఛన్ బకాయిలపై హైకోర్టు ఆదేశించినా రాష్ట్ర ప్రభుత్వం కనికరించడం లేదు. లాక్డౌన్ సమయంలో ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు రెండు నెలలపాటు నిలిపివేసిన సగం వేతనాలు, పెన్షన్లను అక్టోబరు 11వ తేదీలోగా చెల్లించాలని హైకోర్టు రాష్ట్ర ఆర్థిక శాఖకు ఆదేశాలు జారీ చేసింది. కాగా, ఉద్యోగులకు వడ్డీ ఇవ్వలేమంటూ రాష్ట్రప్రభుత్వం సుప్రీంకోర్టులో ఎస్ఎల్పీ(ప్రత్యేక లీవ్ పిటిషన్) దాఖలు చేసింది.
0 comments:
Post a comment