ఏపీ వ్యాప్తంగా 26 మంది డిప్యూటీ కలెక్టర్లను బదిలీ చేస్తూ గవర్నమెంట్ ఉత్తర్వులు జారీ చేసింది. తక్షణం ఈ ఉత్తర్వులు అమల్లోకి వస్తాయని పేర్కొంటూ… సీఎస్ నీలం సాహ్ని ఆదేశాలు ఇచ్చారు. డిప్యూటీ కలెక్టర్ల బదిలీలతో పాటు వెయిటింగ్లో ఉన్నవారికి కూడా పోస్టింగ్‌లు ఇస్తూ ఆదేశాలు వెలువడ్డాయి.
సచివాలయంలో ఎన్నికల విభాగంలో పనిచేస్తున్న వి.సరళను పూలసుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు స్పెషల్ కలెక్టర్‌గా బదిలీ చేశారు. సీసీఎల్ఏలో సహాయ కార్యదర్శిగా పనిచేస్తున్న జె. శివశ్రీనివాసును నెల్లూరు జిల్లా ఆసరా, సంక్షేమ శాఖల జేసీగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. దేవాదాయశాఖలో డిప్యూటీ కలెక్టర్‌గా ఉన్న కిరణ్ కుమార్‌కు పశ్చిమగోదావరి జిల్లా ద్వారకాతిరుమల ఈవోగా నియమించారు.
రైతు బజార్ల సీఈవోగా బి. శ్రీనివాసరావుకు పోస్టింగ్ ఇచ్చారు. డి.పెద్దిరాజును శ్రీకాళహస్తీశ్వర స్వామి ఆలయ ఈవోగా నియమించారు. డి.వెంకటేశ్వరరావును మాన్సాస్ ట్రస్టు ఈవోగా నియమిస్తూ ఏపీ సర్కార్ ఆదేశాలు ఇచ్చింది.
🔳ఏపీలో భారీగా డిప్యూటీ కలెక్టర్ల బదిలీ
ఆంధ్రప్రదేశ్‌లో 26 మంది డిప్యూటీ కలెక్టర్లు బదిలీ అయ్యారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇందులో పేర్కొన్న బదిలీలు, నియామకాలకు సంబంధించిన ఆదేశాలు తక్షణమే అమల్లోకి వస్తాయని పేర్కొన్నారు.(చదవండి: వచ్చేనెల 20 నుంచి డిసెంబర్ 1 వరకు పుష్కరాలు)
బదిలీలు- డిప్యూటీ కలెక్టర్ల పేర్లు
1. వి. సుబ్బారావు
2. డి. కోదండరామిరెడ్డి
3. వీకే సీనా నాయక్
4. ఎన్వీవీ సత్యనారాయణ
5. టి. భాస్కర్ నాయుడు
6. ఎ. లక్ష్మీ కుమారి
7. ఏబీవీఎస్బీ శ్రీనివాస్
8. ఎం.డి. ఝాన్సీరాణి
9. సి. చంద్రశేఖర్ రెడ్డి
10.ఎం. వెంకట సుధాకర్
11. పి. భవానీ
12. జె. శివ శ్రీనివాసు
13. ఎస్. సరళా వందనం
14. కె. రాములు నాయక్
15. కె. అడ్డయ్య
16. కిరణ్ కుమార్
17. ఎం. శ్రీనివాసులు
18.ఎ. చంద్ర మోహన్
19. బి. శ్రీనివాసరావు
20. ఆర్. ప్రభాకర్‌రావు
21. డి. పెద్దిరాజు
22. డి. వెంకటేశ్వరరావు
23. జి. శ్రీనివాసులు
24. హెచ్. సుబ్బరాజు
25. వైవీ సత్య భాస్కర్
26. శ్రీకాంత్ ప్రభాకర్
0 comments:
Post a comment