100W ఛార్జింగ్ టెక్నాలజీ.. ఎప్పుడొస్తుంది?
రోజు రోజుకీ ఫోన్ వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో మొబైల్ ఫోన్ తయారీ కంపెనీలు కొత్త బ్యాటరీ సాంకేతికతపై దృష్టి సారిస్తున్నాయి. కేవలం నిమిషాల వ్యవధిలో పూర్తి బ్యాటరీ ఛార్జ్ అయ్యేలా ఫాస్ట్ ఛార్జింగ్ ఫీచర్స్‌తో ఛార్జర్లను తీసుకొస్తున్నాయి. ఇప్పటికే షావోమి, రియల్మీ వంటి కంపెనీలు 120 వాట్, 125 వాట్ వైర్ ఛార్జింగ్ టెక్నాలజీని పరిచయం చేశాయి. దానితో పాటు షావోమి 55 వాట్ వైర్లెస్ ఛార్జింగ్ టెక్నాలజీని కూడా తీసుకొచ్చింది. తాజాగా క్వాల్‌కోమ్ క్విక్ ఛార్జ్ 5.0 పేరుతో 100 వాట్ ఫాస్ట్ వైర్ ఛార్జింగ్‌ను తీసుకొస్తున్నట్లు ప్రకటించింది.
అయితే వైర్ ఛార్జింగ్‌తో పాటు ఫాస్ట్ వైర్లెస్ ఛార్జింగ్ కూడా ఈ ఏడాది చివర్లో గానీ, వచ్చే ఏడాదికి గానీ అందుబాటులోకి రావచ్చని టెక్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
షావోమి ఎంఐ 10 అల్ట్రా ఫోన్లో 50 వాట్ ఫాస్ట్ వైర్లెస్ ఛార్జింగ్ ఫీచర్‌ను తీసుకొచ్చారు. ఇదే తరహాలో ఒప్పో, షావోమి కంపెనీలు 100 వాట్ వైర్లెస్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీని తీసుకొచ్చే పనిలో ఉన్నాయని తెలుస్తోంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న వైర్లెస్ ఛార్జింగ్ టెక్నాలజీతో 4,000 ఎంఏహెచ్ బ్యాటరీని కేవలం 30 నిమిషాల్లో చార్జింగ్ చేసుకోవచ్చు. ఒకవేళ 100 వాట్ వైర్లెస్ ఫాస్ట్ ఛార్జింగ్ విడుదలయితే కేవలం నిమిషాల వ్యవధిలో ఫోన్ బ్యాటరీ ఛార్జ్ అవుతుంది.
0 comments:
Post a comment