సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతూనే ఉన్నారు. తప్పుడు సందేశాలతో జనాలను బురిడీ కొట్టించి మోసాలకు పాల్పడుతున్నారు. వెబ్‌సైట్స్, సోషల్ మీడియా ఖాతాలు హ్యాక్ చేసే కేటుగాళ్లు.. ఇప్పుడు మీ వాట్సప్‌ను కూడా హ్యాక్ చేస్తున్నారు. తాజాగా హైదరాబాద్‌లో వాట్సప్ హ్యాకింగ్ తీవ్ర కలకలం రేపింది. నగరానికి చెందిన పలువురు ప్రముఖుల వాట్సాప్ ఖాతాలు హ్యాకింగ్‌కు గురయ్యాయి. ఎమర్జెన్సీ మెసేజ్‌ల పేరుతో పలువురికి వాట్సప్ సందేశాలు పంపించి.. గుర్తు తెలియని వ్యక్తులు వారి చాట్‌ను హ్యాక్ చేశారు. బాధితుల్లో పలువురు సెలబ్రిటీలు, డాక్టర్లు ఉన్నారు. ఒక మిత్రుడి నుంచి ప్రముఖ ఐటీ నిపుణుడు నల్లమోతు శ్రీధర్‌కు ఇలాంటి సందేశమే వెళ్లడంతో ఈ హ్యాకింగ్ బాగోతం వెలుగులోకి వచ్చింది.
పలువురు ప్రముఖులను టార్గెట్ చేసిన సైబర్ నేరగాళ్లు వారి కాంటాక్ట్‌లో ఉన్న నంబర్ల నుంచి మెసేజ్‌లు పంపించారు. ''ఎమర్జెన్సీ హెల్ప్'' అంటూ ఆరు డిజిట్ల కోడ్‌తో ఎస్ఎంఎస్లు పంపించి.. చాట్‌ను హ్యాక్ చేశారు. మొదట ఒక వ్యక్తి వాట్సాప్ ఖాతా హ్యాక్ అవుతుంది. ఆ తర్వాత ఆ మొబైల్ నెంబర్ నుంచి అతడి ఫ్రెండ్ లిస్టులో ఉన్న వారందరికీ ఒక మెసేజ్ వెళ్తుంది. 'I am sorry i sent you a 6 digits code by sms by mistake can you pass it to me please..? it is urgent (సారీ.. మీకు పొరపాటున 6 అంకెల కోడ్‌ను పంపాను. మీరు ఆ కోడ్‌ను తిరిగి పంపించండి ప్లీజ్. చాలా అర్జెంట్)'. ఇది ఆ సందేశం. ఆ తర్వాత వారందరి ఫోన్లకు ఒక SMS వస్తుంది. అందులో 6 అంకెల కోడ్‌తో పాటు ఒక లింక్ కూడా ఉంటుంది. ఆ కోడ్‌ను వాట్సాప్ ద్వారా పంపించినా.. లింక్ క్లిక్ చేసినా.. వాట్సప్ క్రాష్ అవుతుంది. ఎవరైనా ఫోన్ చేసి అడిగినా కోడ్‌ను ఎట్టి పరిస్థితుల్లో చెప్పకూడదు.ఐతే ఇలాంటి సెక్యూరిటీ ఇబ్బందులు రాకుండా ఉండేందుకు అందరూ వాట్సప్‌లో అదనపు ప్రొటెక్షన్ లేయర్ ఏర్పాటు చేసుకోవాలని నల్లమోతు శ్రీధర్ సూచించారు. అందుకోసం వాట్సప్‌లో అకౌంట్ సెక్షన్‌కు వెళ్లి టూ స్టెప్ వెరిఫికేషన్ (Two step verification) ఉంటుంది. దాన్ని క్లిక్ చేసి ఎనేబుల్ చేసుకోవాలి. అనంతరం పాస్‌కోడ్ సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. హ్యాకర్ మీ వాట్సప్‌ను హ్యాక్ చేస్తే.. ఈ కోడ్ అడుగుతుంది. అది ఎంటర్ చేస్తేనే వాట్సప్‌ను యాక్సెస్ చేయగలుగుతారు. అందువల్ల ఈ 2 స్టెప్ వెరిఫికేషన్‌ను యాక్టివేట్ చేసుకుంటే.. ఎవరూ మీ ఫోన్‌ను హ్యాక్ చేయలేరు.
వాట్సాప్‌లో వచ్చే కోడ్ మెసేజ్‌లను ఎవరికీ పంపొద్దంటున్న సైబర్ క్రైమ్ పోలీసులు హెచ్చరిస్తున్నారు. కోడ్ పంపితే వాట్సాప్ చాట్‌ను హ్యాక్ అవుతుందని.. అందరూ 2 స్టెప్ వెరిఫికేషన్‌ను యాక్టివేట్ చేసుకోవాలని సూచిస్తున్నారు. ఇక హైదరాబాద్‌లోని పలువురు సెలబ్రిటీల వాట్సప్ ఖాతాలు హ్యాక్ కావడంపై సీరియస్‌గా దృష్టిసారించారు. ఇది ఎవరి పనో తెలుసుకునేందుకు ఐటీ నిపుణులతో కలిసి ప్రయత్నిస్తున్నారు.

0 comments:
Post a comment