Weight Loss : తగినంత నీటితో.. అధిక బరువుకు దూరం కావచ్చు
జీవరాశులకు నీరు ఎంతో ముఖ్యమైనది. నీరు దాహాన్ని తీర్చడమే కాకుండా.. ఐరన్, జింక్, కాపర్, అయోడిన్, కాల్షియం, భాస్వరం, మెగ్నీషియం, ఫ్లోరైడ్ , సోడియం, పోటాషియం, క్లోరైడ్ వంటి పోషకాలను శరీరానికి అందజేస్తుంది. రోజుకు తగినంత నీరు తీసుకోవడం అనేది చాలా ముఖ్యం. ఇలా చేస్తే మనం తీసుకునే ఆహారంలోని పోషకాలను గ్రహించడం, వ్యర్థ పదార్థాలను బయటకు పంపడానికి వీలవుతుంది. ఇక, ఆరోగ్యకమైన ఆహారం తీసుకుని, తగిన వర్కౌట్స్ చేసినప్పటికీ.. సరైన మోతాదులో నీరు తీసుకోకుంటే డిహైడ్రేషన్ జరిగి పొట్టతో పాటు బరువు పెరగడానికి దారితీస్తుంది.
అసలు నీరు ఎందుకు తీసుకోవాలి..? శరీరంలో 70 శాతం నీటితోనే నిర్మితమవుతుంది..
కనుక శరీరంలో అవసరమైన అన్ని విధులను నిర్వర్తించడానికి నీరు చాలా అవసరం. జీవక్రియ సక్రమంగా జరగడంలో, వ్యర్థ పదార్థాలను తొలగించడంలో నీరు ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. శరీరంలో పనులు జరగడానికి నీరు చాలా అవసరం.. ఒకవేళ తగినంత నీరు తీసుకోనప్పుడు అది నీటిని నిలుపుకోవడం ప్రారంభిస్తుంది. తద్వారా బరువు పెరగడం, డిహైడ్రేషన్ జరగవచ్చు.
తగినతం నీరు తీసుకోకపోతే..
ఆకలి ఏర్పడుతుంది : సరైన మొత్తంలో ఆహారం, నీరు తీసుకోకపోవడం.. ఒకదానితో మరోకటి అనుసంధానించబడి ఉంటాయి. ఈ సమయంలో డీ హైడ్రేషన్ జరిగినప్పుడు.. శరీరం మెదడుకు సిగ్నల్స్ పంపుతోంది. దీనికి ప్రతిస్పందనగా.. దాహం, ఆకలి అవుతున్న సంకేతాలను మెదడు పంపడం జరుగుతుంది. ఇలాంటి సందర్భాలు అతిగా తినేందుకు దోహదపడతాయి.
జీవక్రియ తగ్గిపోతుంది : తగినంత నీరు తీసుకోకపోవడం వల్ల జీవక్రియ తగ్గుతుంది. ఈ సమయంలో బరువు తగ్గడానికి బదులు బరువు పెరుగుతారు. శరీరంలో ద్రవాల స్థాయి తక్కువగా మలబద్దకంగా అనిపిస్తుంది. శరీరంలో అంతర్గ వ్యవస్థ సక్రమంగా పనిచేయకపోతే..బరువు తగ్గడం కష్టం. చాలా మంది పని ఒత్తిడిలో పడి తగినంత నీటిని తీసుకోకపోవడం వల్ల డీహైడ్రేషన్ జరిగి, జీవక్రియ తగ్గి బరువు పెరగడం జరుతుతోంది.
రోజుకు ఎంత నీరు తీసుకోవాలి..బరువు తగ్గాలని ప్రయత్నించేవారు రోజుకు కనీసం 2 లీటర్ల నీరు తాగాలి. ఒకవేళ బరువు తగ్గడానికి వ్యాయమం చేస్తుంటే.. ప్రతి రోజు 3 లేదా అంతకంటే ఎక్కువ పరిమాణంలో నీరు తీసుకోవాలి. భోజనానికి 30 నిమిషాల ముందు 500 మి.లీ నీరు తాగడం.. బరువు తగ్గడానికి సహాయపడుతుందని ఓ అధ్యయనం వెల్లడించింది. ఇలా చేయడం కొద్దిపాటి ఆకలి తగ్గించి.. అతిగా తినకుండా చేస్తుంది. పండ్లు, పండ్ల రసాలు తీసుకోవడం ద్వారా కూడా శరీరం డీహైడ్రేడ్ కాకుండా చూసుకోవచ్చు.

0 comments:
Post a comment