తెలంగాణ మరియు దాని పరిసర ప్రాంతాలలో ఉపరితల ఆవర్తనం 2.1 కిలోమీటర్ల ఎత్తు వరకు కొనసాగుతోంది. ఉత్తర తమిళనాడు తీరానికి దగ్గరలో నైరుతి బంగాళాఖాతంలో 7.6 కిలోమీటర్ల ఎత్తు వద్ద ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఈశాన్య బంగాళాఖాతం మరియు దాని పరిసర ప్రాంతాలలో సుమారుగా సెప్టెంబరు 20వ తేదీన అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. ఇక ఏపీలోని పలు ప్రాంతాల్లో మూడు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ఉత్తర కోస్తా ఆంధ్రాలో ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు చాలాచోట్ల కురిసే అవకాశం ఉంది. తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలలో భారీ వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది.
దక్షిణకోస్తా ఆంధ్రాలో ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు చాలాచోట్ల కురిసే అవకాశం ఉంది. కృష్ణా, గుంటూరు జిల్లాలలో భారీ వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని పేర్కొంది. రాయలసీమలో ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు చాలాచోట్ల కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఇక తెలంగాణలోనూ రాగల మూడు రోజుల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు అనేక చోట్ల కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. అదిలాబాద్, అసిఫాబాద్, నిర్మల్, నిజామాబద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, సిద్ధిపేట, వికారాబాద్, మేడ్చల్, హైదరాబాద్, రంగారెడ్డి, యాదాద్రి భువనగిరి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, నల్లగొండ, వనపర్తి, గద్వాల, నారాయణపేట, జిల్లాలో అతి భారీ వర్షాలు మరియు రేపు భారీ వర్షాలు కురిసే అవకాశ ఉందని పేర్కొంది.

0 comments:
Post a comment