Transfers to 35,000 teachers!
The rationalization for the ratio of students to teachers was found to be as high as about 15,000 teachers. They must be transferred. The teacher rationalization process according to the number of students ended on Friday.
35వేల మంది గురువులకు బదిలీలు!
విద్యార్థులు, ఉపాధ్యాయుల నిష్పత్తికి అనుగుణంగా చేసిన హేతుబద్ధీకరణలో సుమారు 15వేల మంది ఉపాధ్యాయులు ఎక్కువగా ఉన్నట్లు తేల్చారు. వీరు తప్పనిసరిగా బదిలీ కానున్నారు. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఉపాధ్యాయుల హేతుబద్ధీకరణ ప్రక్రియ శుక్రవారంతో ముగిసింది. ఈ వివరాలను జిల్లా విద్యాధికారుల వెబ్సైట్లో నమోదు చేయనున్నారు. వీరు కాకుండా 8ఏళ్లు సర్వీసు పూర్తి చేసుకున్నవారు మరో 20 వేల వరకు ఉన్నారు. అంటే ఈసారి మొత్తంగా 35 వేల మంది తప్పనిసరిగా బదిలీ కానున్నారు. ఉపాధ్యాయుల బదిలీలకు సంబంధించి పాఠశాలల కేటగిరీలు, ఖాళీలు, ప్రాధాన్య కోటా వినియోగం వివరాలను నమోదు చేయాలని జిల్లా విద్యాధికారులను పాఠశాల విద్యాశాఖ ఆదేశించింది. హెచ్ఆర్ఏ 20 శాతం, 14.5 శాతం, 12 శాతం ఉన్నవి, బడుల వివరాలను ఆన్లైన్లో నమోదు చేస్తారు. ఐచ్ఛికం ఇవ్వగానే ఆ పాఠశాల ఏ కేటగిరీ కిందకు వస్తుందో తెలుస్తుంది.
🔰రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం ఉన్న ఖాళీల వివరాలను ఆన్లైన్లో ఉంచనున్నారు. వీటిని జిల్లా విద్యాధికారికార్యాలయం నమోదు చేయనుంది.
🔰8ఏళ్లు సర్వీసు పూర్తి చేసుకున్న ఉపాధ్యాయులు, 5ఏళ్లు పూర్తి చేసుకున్న ప్రధానోపాధ్యాయులు గతంలో ప్రాధాన్య కేటగిరీని వినియోగించుకున్నారా లేదా అన్నది నమోదు చేయనున్నారు. ఈ సదుపాయాన్ని 8ఏళ్లకు ఒక్కసారి మాత్రమే వినియోగించుకోవాల్సి ఉంటుంది.

0 comments:
Post a comment