The High Court has become serious about the AP government. The High Court was incensed at the government for withholding widow's pensions. Outraged at the government counter in the case that pensions were suspended for political reasons.
ఏపీ ప్రభుత్వంపై హైకోర్టు సీరియస్...
ఏపీ ప్రభుత్వంపై హైకోర్టు సీరియస్ అయింది. వితంతు పెన్షన్లు నిలిపివేయడంపై ప్రభుత్వంపై హైకోర్టు మండిపడింది. రాజకీయ కారణాలతో పెన్షన్లు నిలిపివేశారన్న కేసులో ప్రభుత్వ కౌంటర్పై ఆగ్రహం వ్యక్తం చేసింది. వితంతువులంటూ అబద్దాలు చెబుతున్నారనడంపై హైకోర్టు మండిపడింది. ఏ మహిళా కూడా భర్త ఉన్నప్పటికీ వితంతువునని చెప్పదని, ఒంటరి జీవితం ఎంత దుర్భరంగా ఉంటుందో అందరికీ తెలుసని న్యాయస్థానం వ్యాఖ్యానంచింది. ప్రభుత్వం ఇచ్చే పెన్షన్ వారి ఆర్ధిక కష్టాలను కొంతవరకు తీరుస్తుందని కోర్టు పేర్కొంది.
పుష్కరాలకు కోట్ల రూపాయలు ఖర్చు చేయమని మిమ్మల్ని ఎవరు అడిగారు?.. రంజాన్ తోఫా, క్రిస్మస్ కానుకలు ఇవ్వమని ఎవరైనా అడిగారా?
అని ధర్మాసనం ప్రశ్నించింది. కోట్లు వెచ్చించి ప్రభుత్వ కార్యాలయాలకు రంగులు వెయ్యమని ఎవరైనా అడిగారా?.. ప్రభుత్వ కార్యాలయాలకు కోట్ల రూపాయలు వెచ్చించి రంగులు వెయ్యమని ఎవరైనా అడిగారా అని కోర్టు ప్రభుత్వంపై ప్రశ్నల వర్షం కురిపించింది. పేదల సంక్షేమం కోసం పథకాలు అమలు చేయడాన్ని ఎవరూ కాదనరని, పెన్షన్లు ఆపిన వితంతువులకు 15 రోజుల్లోగా పెన్షన్లు ఇవ్వాలని, పాతపెన్షన్లు ఇవ్వడంతో పాటు భవిష్యత్లో కూడా పెన్షన్లు చెల్లించాలని హైకోర్టు ఆదేశించింది.

0 comments:
Post a comment