Search This Blog

FLASH NEWS ⚡⚡⚡ ఫ్లాష్ న్యూస్...

 • Spoken English-books,Material NEW...
 • MORE TO VIEW

Saturday, 19 September 2020

TEACHER TRANSFERS UPDATE మాస్టర్ డేటా కి సంబంధించి DEO లకి అప్లికేషన్ విడుదల చేసిన పాఠశాల విద్యా శాఖ

నేటి కల్లా టీచర్ల వివరాల నమోదుకు ఆదేశం

♦బదిలీల దిశగా కసరత్తు ప్రారంభం

♦డీఈవో పూల్‌ కోటాఉపాధ్యాయులపై స్పష్టత లేమి
ఈనాడు-గుంటూరు :
ఉపాధ్యాయ బదిలీల జీఓ వెలువడకున్నా దీనికి సంబంధించిన కసరత్తుకు పాఠశాల విద్యాశాఖ అధికారికంగా శ్రీకారం చుట్టింది. సోమవారం నాటికి పాఠశాలల వారీగా ఉన్న ఖాళీ పోస్టుల వివరాలను కమిషనర్‌ ఆఫ్‌ స్కూల్‌ ఎడ్యుకేషన్‌(సీఎస్‌ఈ) లాగిన్‌కు పంపాలని జిల్లా విద్యాశాఖ అధికారులను ఆదేశించింది. దీంతో బదిలీల్లో తొలి అంకానికి తెరలేచినట్లు అయింది. ఆదివారం సెలవు అయినా పలువురు ఎంఈవోలు, హైస్కూల్‌ ప్రధానోపాధ్యాయులు డీఈఓ కార్యాలయానికి చేరుకుని కంప్యూటర్‌ విభాగం సిబ్బందితో వివరాలు ఎలా ఎంఈఓ లాగిన్‌కు ఆన్‌లైన్‌లో అనుసంధానం చేయాలో అడిగి తెలుసుకున్నారు. ఇలా వచ్చిపోయే వారితో డీఈవో కార్యాలయం సందడిగా మారింది. జిల్లా విద్యాశాఖ అధికారి ఆర్‌.ఎస్‌.గంగాభవాని జిల్లాలోని అన్ని మండల విద్యాశాఖ అధికారుల నుంచి డీఈవో లాగిన్‌కు సోమవారానికి వివరాలను అప్‌డేట్‌ చేయాలని ఆదేశించారు. జిల్లాల వారీగా ఖాళీ పోస్టులు.. ఒకే చోట 8 ఏళ్లుగా పనిచేస్తున్న ఉపాధ్యాయుల వివరాలు, ఐదేళ్ల సర్వీసు పూర్తయిన హెచ్‌ఎంల సమాచారం ప్రతిదీ తెలుస్తాయి. ఈ సమాచారం తొలుత సేకరించడం వల్ల బదిలీలకు ఎంత మంది అర్హులు కాబోతున్నారనేది ప్రభుత్వానికి స్పష్టత వస్తుంది. ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల వివరాలను మండల విద్యాశాఖ అధికారి, ఉన్నత పాఠశాలల్లో నెలకొన్న ఖాళీల వివరాలను ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఆన్‌లైన్‌లో ఎంఈవో లాగిన్‌కు పంపాలి. ఈ వివరాల నమోదుకు ఉన్నత పాఠశాలల హెచ్‌ఎంలు సైతం సోమవారం ఎంఈఓ కార్యాలయానికి వెళ్లి ఎంఈఓ లాగిన్‌లోనే నమోదు చేయాలని సూచించారు. ఈ ప్రక్రియ నిర్వహణతో ఉపాధ్యాయవర్గంలో ఆసక్తి నెలకొంది.

♦కొలిక్కిరాని హేతుబద్దీకరణ..

తక్కువ మంది పిల్లలు ఉన్న పాఠశాలల్లో టీచర్ల సర్దుబాటు ఇంకా ఓ కొలిక్కి రాలేదు. దీనిపై స్పష్టత లేకుండా బదిలీలు చేపడితే ఇబ్బందులు వస్తాయని ఉపాధ్యాయ సంఘాలు అంటున్నాయి. ప్రభుత్వం ప్రవేశపెట్టిన జనగన్న గోరుముద్ద పథకం, నాడు-నేడు పనులతో ఆకర్షితులైన తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రైవేటు పాఠశాలల్లో నుంచి తీసుకొచ్చి సర్కారీ పాఠశాలల్లో చేర్పిస్తున్నారు. ఈ ఏడాది చాలా పాఠశాలల్లో ప్రవేశాలు పెరిగాయి. ప్రభుత్వం మాత్రం ఈ ఏడాది ఫిబ్రవరి నాటికి ఆయా పాఠశాలల్లో ఉన్న పిల్లల సంఖ్య, టీచర్ల నిష్పత్తి ఆధారంగా మిగులు ఉపాధ్యాయులను గుర్తించాలని ఆదేశించింది. ప్రస్తుతం ఉన్న ప్రవేశాలను పరిగణనలోకి తీసుకుని హేతుబద్ధీకరణ చేపడితే మిగులు ఉపాధ్యాయుల లెక్కలు పక్కాగా తేలడానికి ఆస్కారం ఉంటుంది. దీన్ని పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది.

♦వివరాల నమోదు ఇలా..

ఆన్‌లైన్‌లో నమోదు చేయాల్సిన టీచర్ల వివరాలకు సంబంధించి ట్రెజరీ ఐడీ నంబరు, ఉపాధ్యాయుని పేరు, పని చేస్తున్న పాఠశాల పేరు, ఎన్నాళ్ల నుంచి అక్కడ పని చేస్తున్నారు, సర్వీసులో ఎప్పుడు ప్రవేశించారు, ప్రస్తుతం పని చేస్తున్న పాఠశాలలో ఎప్పుడు చేరారు, బోధిస్తున్న అంశం, ఎస్‌జీటీనా, స్కూల్‌ అసిస్టెంటా?, ఏ భాషలో బోధిస్తున్నారు, గడిచిన 8 ఏళ్లలో స్పౌజ్‌ కోటా ఏమైనా వినియోగించుకున్నారా, గతంలో ఎప్పుడైనా ప్రిఫరెన్షియల్‌ కేటగిరీలో బదిలీ పొందారా, పొందితే ఆ వివరాలు నమోదు చేయాలని పాఠశాల విద్యాశాఖ ఆదేశించింది.

♦ఉన్నతీకరించినపాఠశాలల పరిస్థితి ఏమిటి?*జిల్లాలో అడవితక్కెళ్లపాడు, వెంగళాయపాలెం, జగ్గాపురం తదితర 38 ప్రాథమికోన్నత పాఠశాలలను ఉన్నత పాఠశాలలుగా రెండేళ్ల క్రితమే ఉన్నతీకరించారు. కానీ ఇప్పటికీ ఆ స్కూళ్లకు రెగ్యులర్‌ ప్రధానోపాధ్యాయుల పోస్టు మంజూరు కాలేదు. సమీపంలో ఉన్న పాఠశాల హెచ్‌ఎంను ఇన్‌ఛార్జిగా పెట్టి పర్యవేక్షిస్తున్నారు. దీన్ని పరిగణనలోకి తీసుకోవాలని సంబంధిత పాఠశాలల ఉపాధ్యాయులు కోరుతున్నారు. జిల్లాలో 2014 డీఎస్సీలో ఉత్తీర్ణులైన సుమారు 28 మంది ఉపాధ్యాయులకు ఇప్పటి దాకా పోస్టింగ్‌లు ఇవ్వలేదు. వారిని డీఈవో కోటా పూల్‌లో ఉంచి వారి సేవలు ఎక్కడ అవసరమైతే అక్కడకు పంపి వినియోగించుకుంటున్నారు. వీటిని బదిలీల ప్రక్రియ ప్రారంభం కాక మునుపే పరిష్కరించాలి.
TEACHER TRANSFERS UPDATE
మాస్టర్ డేటా కి సంబంధించి DEO లకి అప్లికేషన్ విడుదల చేసిన పాఠశాల విద్యా శాఖ


All the DEO's are informed that the following services are enabled in the respective logins for

1. updating the schools category and area
2. Update Teacher Availed Spouse/preferntial Category for the ensuing teacher transfers to be scheduled.
 Therefore all are requested to best of your personal attention by duly constituting the teams for updation in next two days without fail

deoeg Instructions-ap sent: 


Reapportionment of Teachers:

Attend the review/verification work along with
1) School wise Class wise Enrollment as on 29.02.2020
2) School wise Cadre Strength
3) Clear Vacancies as on 01.09.2020
4) Long Standing Vacancies in PS & UPS (who joined in the present school on or before 18.11.2012)
5) HRA Category of schools (changes if any occurred submit with dates)
6) Teachers preferential category / spouse cases who utilized in last 10 years (i.e., from 2009 onwards)
Submit in soft and hard copies of data. 
The concerned MEOs should attend along with MIS/CO with Laptops.

Follow the Covid-19 Protocol while attending the review.

Schedule for DyEOs will be issued soon.

Therefore all are requested to best show your personal attention by duly constituting the teams for updation in next two days without fail.

AP TRANSFERS-2020 SCHOOL CATEGORY DETAILS AND VACANCIES

AP TRANSFERS-2020 TEACHER PREFRENTIAL CATEGORY DETAIL

AP TRANSFERS-2020 TEACHER DETAILS EDIT


0 comments:

Post a comment

Teachers INFO

 • SCERT - OFFICIAL - 10th class new pattern Model papers Latest
 • CLICK FOR MORE

Teachers News,Info

 • CCE Formative Assessment Tools and Guidelines for FA1, FA2, FA3, FA4 in AP Schools,FA Model papersLatest
 • CLICK FOR MORE
  Acadamic Reated Lables

District wise info

More
AP District wise updates

Pimary Classes TLM,Material

 • June Month Syllabus - 1 to 5th Telugu / English RhymesLatest
 • CLICK FOR MORE
  TLM For Primary Classes( 1 to 5th ) subject wise
  TLM For Class wise

High school -TLM,Material

CLICK FOR More

TLM @ High school classes(6 to 10th)Subject Wise
TLM , Studyy Material For High school classes

General Issues

CLICK FOR MORE
General Lables

Students Related Info

CLICK FOR MORE
STUENTS INFORMATION LABLES

AP District wise Updates

More
AP District wise updates

Follow by Email

To get updates from aptnusinfo.blogspot.com to your Email directly,Enter your email id and click submit button,Then a popup windo will open,then type the Captcha code,Then go t your mail inbox,a confirmation mail will be there, verify that.Next onwards when ever i post a new one automatically a mail will be sent you.
Top