ఇండియాలో డైరెక్ట్-టు-హోమ్ (డిటిహెచ్) ప్రొవైడర్లలో అందరికంటే ఎక్కువ మంది వినియోగదారులను కలిగిన టాటా స్కై ఇప్పుడు తన వినియోగదారులకు మరొక గొప్ప అవకాశాన్ని అందిస్తున్నది. ఇది తన యొక్క సేవలలో మూవీస్ ఆన్ రెంట్‌ను కూడా విస్తరించింది. అంటే టాటా స్కై యొక్క మొబైల్ యాప్ వంటి డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లకు వీడియో ఆన్-డిమాండ్ సేవను వినియోగించడం.
టాటా స్కై మూవీస్ ఆన్ రెంట్ సర్వీస్
టాటా స్కై చందాదారులకు "యాక్టివ్ అకౌంట్ స్టేటస్" తో మూవీస్ ఆన్ రెంట్ సర్వీస్ అందుబాటులో ఉంటుందని సంస్థ తెలిపింది. చందాదారులు టాటా స్కై మొబైల్ యాప్ మరియు వాచ్ టాటా స్కై పోర్టల్ ఉపయోగించి సినిమాలను అద్దెకు ఆర్డర్ చేయవచ్చని డిటిహెచ్ ఆపరేటర్ తన వెబ్సైట్లో తెలిపింది.
సినిమాలను ఆర్డర్ చేసిన వినియోగదారులు మొబైల్ యాప్, వెబ్ పోర్టల్ లేదా టాటా స్కై బింగేలో కంటెంట్‌ను చూడవచ్చని టాటా స్కై తెలిపింది. వీటి గురించి మరిన్ని వివరాలను తెలుసుకోవడానికి ముందుకు చదవండి.
టాటా స్కై డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లపై సినిమాలను అద్దెకు తీసుకోవడం
టాటా స్కై యొక్క చందాదారులు తమకు నచ్చిన కంటెంట్ ను దాని డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలో 30 రోజుల పాటు "పలుమార్లు" చూడటానికి వీలుగా అద్దెకు తీసుకోవడానికి ఇప్పుడు వీలుకల్పిస్తున్నది. అయితే కంటెంట్‌కు 48 గంటల ప్లేబ్యాక్ గడువు వ్యవధి ఉంటుందని డిటిహెచ్ ఆపరేటర్ ప్రత్యేకంగా తెలిపింది. కాకపోతే ios ప్లాట్ఫామ్లో ఈ సర్వీస్ అందుబాటులో లేదు. ఐఓఎస్ ప్లాట్‌ఫామ్‌లోని యూజర్లు ఆండ్రాయిడ్ యాప్ లేదా వెబ్ పోర్టల్ ఉపయోగించి కంటెంట్‌ను పొందవచ్చని డిటిహెచ్ ఆపరేటర్ చెప్పారు.
టాటా స్కై "మూవీస్ ఆన్ రెంట్" పొందే విధానం
ఉదాహరణకు అర్హత కలిగిన ఎవరైనా చందాదారుడు సెప్టెంబర్ 9 న ఉదయం 10:00 గంటలకు కంటెంట్‌ను ప్లే చేయడం ప్రారంభిస్తే కనుక అతడు / ఆమె వచ్చే 48 గంటలలోపు అంటే సెప్టెంబర్ 11 ఉదయం 9:59 గంటలలోపు కంటెంట్‌ను చూడటం పూర్తి చేయాలి. కంటెంట్ గడువు ముగుస్తుందని టాటా స్కై ముందుగా తెలియజేస్తుంది అని టాటా స్కై తన వెబ్సైట్లో తెలిపింది.
టాటా స్కై అకౌంట్ "మూవీస్ ఆన్ రెంట్" సబ్స్క్రిప్షన్
"మూవీస్ ఆన్ రెంట్" విభాగం కింద జాబితా చేయబడిన కంటెంట్ ను ఎంచుకున్నప్పుడు దాని యొక్క సబ్స్క్రిప్షన్ మొత్తం ధర యూజర్ యొక్క DTH అకౌంట్ నుండి తీసుకోబడుతుంది అని టాటా స్కై తెలిపింది.
డిటిహెచ్ ఆపరేటర్ ప్రస్తుతం 'మూవీస్ ఆన్ రెంట్' విభాగం కింద ది గ్రడ్జ్ మూవీని జాబితా చేశారు. 2020 ప్రారంభంలో సోనీ పిక్చర్స్ విడుదల చేసిన ది గ్రడ్జ్ అనే అమెరికన్ హర్రర్ చిత్రం టాటా స్కై షోకేస్ మూవీ ఛానెల్లో కూడా అందుబాటులో ఉంది. టాటా స్కై తన డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లో వినియోగదారులు ఆదేశించిన కంటెంట్ స్ట్రీమింగ్ కోసం అందుబాటులో ఉంటుందని మరియు కంటెంట్ "ఏ ప్లాట్ఫామ్లలోనైనా డౌన్లోడ్ కోసం అందుబాటులో ఉండదు" అని అన్నారు.
0 comments:
Post a comment