Swami Agnivesh: సామాజిక ఉద్యమకారుడు స్వామి అగ్నివేష్ కన్నుమూత...
ప్రముఖ సామాజిక ఉద్యమకారుడు స్వామి అగ్నివేష్ కన్నుమూశారు. ఆయన వయసు 80 సంవత్సరాలు. గత కొన్నాళ్లుగా స్వామి అగ్నివేష్ లివర్ సమస్యతో బాధపడుతున్నారు. కొన్ని రోజులుగా ఆస్పత్రిలో చికిత్సపొందతూ చనిపోయారు. స్వామి అగ్నివేష్ హర్యానా నుంచి ఓసారి ఎమ్మెల్యేగా గెలపొందిరు. ఆర్య సభను స్థాపించారు. ఆర్య సమాజ్ సిద్ధాంతాల మీద ఆ రాజకీయ పార్టీ నడుస్తుంది. స్వామి అగ్నివేష్ ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వారు. శ్రీకాకుళంలోని సనాదన బ్రాహ్మణ కుటుంబంలో 1939 సెప్టెంబర్ 21న జన్మించారు. అగ్నివేష్‌కు నాలుగు సంవత్సరాల వయసు ఉన్నప్పుడు ఆయన తండ్రి కన్నుమూశారు. అనంతరం ప్రస్తుతం ఛత్తీస్‌గఢ్‌లో ఉన్న శక్తి అనే రాజ్యంలో దివాన్ అయిన తన తాతవారింట పెరిగారు.
న్యాయశాస్త్రం, వాణిజ్యంలో డిగ్రీలు సంపాదించారు. కోల్‌కతాలోని సెయింట్ జేవియర్స్ కాలేజీలో లెక్చరర్‌గా పనిచేశారు. సభ్యసాచి ముఖర్జీ అనే ప్రఖ్యాత న్యాయవాది వద్ద జూనియర్ లాయర్‌గా పనిచేశారు. ఆ తర్వాత సభ్యసాచి ముఖర్జీ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ అయ్యారు.
1970లో స్వామి అగ్నివేష్ ఆర్య సభ అనే రాజకీయ పార్టీని స్థాపించారు. ఆర్య సమాజ్ సిద్ధాంతాల మీద ఈ రాజకీయ పార్టీ నడుస్తుంది. 1977వ సంవత్సరంలో అగ్నివేష్ హర్యానా అసెంబ్లీకి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. విద్యాశాఖ మంత్రిగా పనిచేశారు. 1981లో ఆయన మంత్రిగా ఉన్న సమయంలోనే బాండెడ్ లేబర్ లిబరేషన్ ఫ్రంట్ అనే సంస్థను స్థాపించారు. శ్రమదోపిడీకి వ్యతిరేకంగా గళమెత్తారు. ముఖ్యంగా ఢిల్లీ చుట్టుపక్కల ఉండే క్వారీల్లో కార్మికుల శ్రమదోపిడీకి వ్యతిరేకంగా పోరాడారు. హత్యానేరం ఆరోపణల్లో 14 నెలలు జైలు శిక్ష కూడా అనుభవించారు.2011వ సంవత్సరంలో దేశవ్యాప్తంగా జరిగిన అవినీతి వ్యతిరేక ఉద్యమంలో అగ్నివేష్ కూడా పాలుపంచుకున్నారు. కొందరు నిరసనకారులు తన మీద వ్యక్తిగత, రాజకీయ ఎజెండాలతో దుష్ప్రచారం చేస్తున్నారంటూ ఆయన ఆందోళనల నుంచి విరమించుకున్నారు. 2011 సంవత్సరంలోనే మావోయిస్టులు కిడ్నాప్ చేసిన ఐదుగురు ఛత్తీస్‌గఢ్ పోలీసులను విడిపించడంలో మావోయిస్టులతో చర్చలు జరిపిన బృందంలో అగ్నివేష్ కూడా ఒకరు.
1970లో సన్యాసం స్వీకరించారు స్వామి అగ్నివేష్. అయితే, ఆయన మీద హిందూ వ్యతిరేక ముద్ర పడింది. ఒడిశాలోని పూరీ జగన్నాథ్ ఆలయాన్ని హిందుయేతరుల కోసం కూడా తెరవాలంటూ ఆయన డిమాండ్ చేశారు. హిందువులు అత్యంత పవిత్రంగా పూజించే అమర్నాథ్ శివలింగం కేవలం ఓ మంచు ముక్క అంటూ అగ్నివేష్ కామెంట్స్ చేయడంతో హిందూ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. అయితే, అగ్నివేష్ వ్యాఖ్యలను సుప్రీంకోర్టు తప్పుపట్టింది. కోట్లాది మంది మనోభావాలను దెబ్బతీయడం సరికాదని స్పష్టం చేసింది. సెంటిమెంట్ మిళితమైన అంశాలపై మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని సూచించింది.
2008లో ఢిల్లీలోని రామ్ లీలా మైదాన్‌లో జరిగిన జమైత్ ఉలేమా ఈ హింద్ సభలో ఆయన చేసిన వ్యాఖ్యలకు హిందూ సంఘాల నుంచి ప్రతిఘటన ఎదురైంది. ఎవరో కొందరు ఉగ్రవాదులు చేసే తప్పుడు పనులకు మొత్తం మతాన్ని తిట్టడం సరికాదని ఆయన అన్నారు. అసలు అమెరికానే నెంబర్ వన్ టెర్రరిస్టు అని కూడా అన్నారు.
అగ్నివేష్ బిగ్ బాస్‌లో కూడా పాల్గొన్నారు. 2011 సంవత్సరంలో నవంబర్ 8 నుంచి 11 వరకు హిందీ బిగ్ బాస్ హౌస్‌లో అతిథిగా ఉన్నారు.
ప్రముఖ సామాజిక కార్యకర్త స్వామి అగ్నివేష్ మరణం పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమానికి స్వామి అగ్నివేష్ మొదటినుంచి సంపూర్ణ మద్దతుగా నిలిచారని ముఖ్యమంత్రి గుర్తు చేశారు. ఉద్యమ సందర్భంలో జరిగిన సమావేశాలు, కార్యక్రమాల్లో స్వయంగా పాల్గొన్నారని గుర్తు చేసుకున్నారు. ఆయన కుటంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

0 comments:
Post a comment