Search This Blog

FLASH NEWS ⚡⚡⚡ ఫ్లాష్ న్యూస్...

  • Spoken English-books,Material NEW...
  • MORE TO VIEW

Saturday, 26 September 2020

SP Balasubrahmanyam: ఎస్పీ బాల సుబ్రహ్మణం కన్నుమూయడానికి ఆ టీవీ ప్రోగ్రామే కారణమా..

SP Balasubrahmanyam: ఎస్పీ బాల సుబ్రహ్మణం కన్నుమూయడానికి ఆ టీవీ ప్రోగ్రామే కారణమా..
SP Balasubrahmanyam | గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం మరణాన్ని ఎవరూ జీర్ణించుకోలేకపోతున్నారు. అసలు బాలు లేడనే వార్త కూడా నమ్మబుద్ధి కావడం లేదు. ఎందుకంటే ఆయన పాట లేని సంగీత ప్రపంచాన్ని ఊహించుకోవడం కూడా కష్టమే పైగా ఎప్పుడూ కెమెరా ముందు చిరునవ్వుతో కనిపించే బాలు ఇలా ఉన్నట్లుండి దూరమైపోవడం తట్టుకోలేకపోతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఆయన అభిమానులకు ఇది నిజంగానే జీర్ణించుకోలేని వార్త. కర్ణుడి చావుకు సవాలక్ష కారణాలు అన్నట్టు ఆయన చనిపోవడానికి బేరియాట్రిక్ సర్జరీతో పాటు ఓ ప్రోగ్రామ్ కూడా కారణమనే చెప్పాలి. కరోనా విలయ తాండవం చేస్తోన్న వేళ.. 74 ఏళ్ల వయసున్న ఓ పెద్ద మనిషిని ఓ టీవీ షోకు ముఖ్యఅతిథిగా పిలవడం ఆయన చనిపోవడానికి కారణమైందని సోషల్ మీడియా వేదికగా ఎస్పీ బాలు అభిమానులు ఆరోపిస్తున్నారు.
ఆ షో నిర్వాహకుల వల్లే.. ఎపుడు నవ్వుతూ ఉండే ఆ మహామనిషిని సంగీతాభిమానులకు దూరం చేసిందని చెబుతున్నారు.
అసలు బాలుగారు ఆ ప్రోగ్రామ్‌కు వెళ్లకపోయివుంటే.. ఇంత అనర్ధం జరిగిండేది కాదని అంటున్నారు. ప్రభుత్వం సూచనల మేరకు 60 ఏళ్లు పై పడిన వారిని అసలు బయటకు రానీయకండా.. ఇంట్లోనే ఉండాలి. వాళ్లతో ఎలాంటి షూటింగ్స్ గట్రా చేయకూడదనే నిబంధనలున్నాయి. అలాంటి నియమ నిబంధనలు ఉల్లంఘించిన ఆయనకు ప్రోగ్రామ్‌కు అతిథిగా పిలవడం ఈ ప్రోగ్రామ్ నిర్వాహకులు చేసిన పెద్ద తప్పు అంటున్నారు. కనీసం బాలు గారి కుటంబ సభ్యులైన ఆయన్ని ఆ ప్రోగ్రామ్‌కు వెళ్లనీయకుండా ఉంటే బాగుండేది అంటున్నారు.
అసలే కరోనా వైరస్.. పాటలు పాడినా.. గట్టిగా మాట్లాడిన వైరస్ వేగంగా వ్యాప్తి చెందే అవకాశాలున్నాయి. జూలై 30న ఆయన 'సామజవరగమనా' అనే టీవీ షోకు హాజరయ్యారు. ఇక ఈ షోకు హాజరైన వారందరికీ కరోనా సోకింది. అందులో బాలుగారు కూడా ఉన్నారు. మిగతా వారి ఏజ్ 40 ఏళ్ల నుంచి 50 ఏళ్ల లోపు ఉండటంతో వారందరు కరోనా నుంచి కోలుకున్నారు. కానీ 74 ఏళ్ల ఎస్పీ బాలు మాత్రం కరోనా సోకి .. చివరకు అది తగ్గినా.. అప్పటికే కరోనా ఎస్పీ బాలు శరీరంలోని అన్ని అవయాలతో పాటు లంగ్స్‌ను పూర్తిగా దెబ్బతీసింది.
ఈ విషయమై బాలు అభిమానులు చాలా మంది సోషల్ మీడియాలో ఈ ప్రోగ్రామ్ నిర్వాహకులు ఆయన వయసును దృష్టిలో పెట్టుకోలేదు. ఇలాంటి క్లిష్ట సమయంలో ఆయన్ని ముఖ్య అతిథిగా పిలవాల్సిన అవసరం ఏమి వచ్చింది ఆ షో నిర్వాహకులకు. మొత్తంగా ఓ టీవీ ఛానెల్ నిర్వాహకులు చేసిన తప్పిదంతో సినీ ప్రేమికులు ఓ లెజెండ్‌ను కోల్పోవాల్సి వచ్చింది. అపుడు ఆ ప్రోగ్రామ్ జరగపోతే.. కొంపలు ఎవరు కొంపలు మునిగిపోయే పరిస్థితి లేదంటున్నారు. కరోనా వచ్చి ఆరు నెలలు దాటినా.. దాని బారి నుంచి ఎలా రక్షించుకోవాలో ఈ రోజుకు అవగాహన లేకుంటే ఎలా అని ప్రశ్నిస్తున్నారు. ఏది ఏమైనా బాలు వంటి అమర గాయకుడికి రావాల్సిన కష్టం కాదిది అంటూ కన్నీటీ పర్యంతమవుతున్నారు అభిమానులు. అసలు వయసు మీద పడిన వారిని అసలు బయటకే రానీయకుండా ఇంట్లోనే ఐసోలేట్ చేసి ఉండింటే బాలుగారు అసలు కసలు ఈ ఇబ్బందే వచ్చి ఉండేది కాదంటున్నారు. మొత్తానికి ఓ ప్రోగ్రామ్ నిర్వాహకులు కోలుకోలేని పెద్ద తప్పుతో పెద్ద లెజెండ్‌ను కోల్పోవాల్సి వచ్చింది.

3 comments:

  1. ఆ టీవీ ఛానల్ పేరు ప్రస్తావించలేదు ఎందుకని? 74 సంవత్సరాల వయసు కలిగిన బాలు గారిని పిలవడం వెనుక ఆంతర్యమేమిటి ?? కోవిద్19 నిబంధనలు ఆ టీవీ ఛానల్ కు వర్తించవా?? సామాన్య ప్రజలకు మాత్రమే వర్తిస్తాయా?

    ReplyDelete
  2. మీరు కూడా తెలుగు న్యూస్ చానల్స్ లాగా ఉన్నారే. టివి ఛానల్ పేరు చెప్పటం లేదు.

    ReplyDelete
  3. Even ani cheppadaani ki Bhyam yendhuku pygaa Mosali kannellu kaarchatam yendhuku raa chettha Yedhavaaa, rendu moosukoni Ramoji dhi naaku.

    ReplyDelete

Teachers INFO

  • SCERT - OFFICIAL - 10th class new pattern Model papers Latest
  • CLICK FOR MORE

Teachers News,Info

  • CCE Formative Assessment Tools and Guidelines for FA1, FA2, FA3, FA4 in AP Schools,FA Model papersLatest
  • CLICK FOR MORE
    Acadamic Reated Lables

District wise info

More
AP District wise updates

Pimary Classes TLM,Material

  • June Month Syllabus - 1 to 5th Telugu / English RhymesLatest
  • CLICK FOR MORE
    TLM For Primary Classes( 1 to 5th ) subject wise
    TLM For Class wise

High school -TLM,Material

CLICK FOR More

TLM @ High school classes(6 to 10th)Subject Wise
TLM , Studyy Material For High school classes

General Issues

CLICK FOR MORE
General Lables

Students Related Info

CLICK FOR MORE
STUENTS INFORMATION LABLES

AP District wise Updates

More
AP District wise updates

Follow by Email

To get updates from aptnusinfo.blogspot.com to your Email directly,Enter your email id and click submit button,Then a popup windo will open,then type the Captcha code,Then go t your mail inbox,a confirmation mail will be there, verify that.Next onwards when ever i post a new one automatically a mail will be sent you.
Top