Savings Schemes: ఈ పోస్ట్ ఆఫీస్ సేవింగ్ స్కీమ్స్‌తో మీకు ఎంత లాభమో తెలుసుకోండి
ఏమాత్రం నష్టభయం లేకుండా రాబడి ఆశించేవారు పోస్ట్ ఆఫీస్ సేవింగ్ స్కీమ్స్‌లో పెట్టుబడులు పెట్టవచ్చు. వీటిల్లో రాబడితో పాటు డబ్బుకు భద్రత కూడా ఉంటుంది. ఈ జాబితాలో పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ అకౌంట్, ఫిక్స్డ్ డిపాజిట్, రికరింగ్ డిపాజిట్ (పోస్ట్ ఆఫీస్ ఆర్డీ), పోస్ట్ ఆఫీస్ పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పిఓపిపిఎఫ్), పోస్ట్ ఆఫీస్ సీనియర్ సిటిజన్ స్కీమ్ (పిఒఎస్సీఎస్), సుకన్య సమృద్ధి యోజన (ఎస్ఎస్వై) వంటి పలు పథకాలు ఉన్నాయి. వీటిపై ప్రస్తుతం లభించే వడ్డీ రేట్లు పరిశీలిద్దాం.
1. పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్: పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ అకౌంట్లో మీరు దాచుకునే డబ్బుపై నాలుగు శాతం వడ్డీ లభిస్తుంది. ఈ ఖాతాలో వినియోగదారులు కనీసం 500 రూపాయలను మినిమమ్ బ్యాలెన్స్‌గా ఉంచాలి.
గతంలో మినిమమ్ బ్యాలెన్స్ పరిమితి 50 రూపాయలు మాత్రమే ఉండేది. కానీ మారిన నియమ నిబంధనల ప్రకారం ఖాతాలో 500 రూపాయలు లేకపోతే, ఆర్థిక సంవత్సరం చివరిలో 100 రూపాయల జరిమానా విధిస్తారు.
2. పోస్ట్ ఆఫీస్ ఫిక్స్డ్ డిపాజిట్: స్ట్ ఆఫీస్ ఫిక్స్డ్ డిపాజిట్ (పోస్ట్ ఆఫీస్ ఎఫ్డి)లో పెట్టుబడి పెడితే 5.8శాతం చొప్పున వడ్డీ లభిస్తుంది. పోస్ట్ ఆఫీస్ ఫిక్స్డ్ డిపాజిట్లో ఒకటి నుంచి మూడు సంవత్సరాలకు వడ్డీ రేటు 5.5శాతంగా ఉంది. ఐదు సంవత్సరాల ఫిక్స్డ్ డిపాజిట్‌పై వడ్డీ రేటు 6.7శాతంగా ఉంది. పోస్టాఫీసులో ఐదు సంవత్సరాల ఫిక్స్డ్ డిపాజిట్‌పై ఆదాయపు పన్ను చట్టం 1961- సెక్షన్ 80 సి ప్రకారం పన్ను మినహాయింపు లభిస్తుంది.
3. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్: పోస్టల్ పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్‌లో డిపాజిట్లపై సంవత్సరానికి 7.1శాతం వడ్డీ లభిస్తుంది. ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.500 నుంచి రూ.1.5 లక్షలు పెట్టుబడి పెట్టవచ్చు. ఈ స్కీమ్‌లో డబ్బు మొత్తాన్ని ఒకేసారి, లేదా 12 వాయిదాల్లో జమ చేయవచ్చు. దీనికి మెచ్యూరిటీ 15 సంవత్సరాలు. దీనికి కూడా ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80 సి ప్రకారం పన్ను మినహాయింపు ఉంది.
4. సుకన్య సమృద్ధి యోజన: సుకన్య సమృద్ధి యోజనలో పెట్టుబడిపై సంవత్సరానికి 7.6వడ్డీ లభిస్తుంది. బాలికల తల్లిదండ్రులు 14 సంవత్సరాలు మాత్రమే ఎస్ఎస్వైలో పెట్టుబడి పెట్టేందుకు అవకాశం ఉంది. ఆడపిల్లలకు 21 సంవత్సరాలు వచ్చిన తరువాతే డబ్బు తీసుకోవచ్చు. ఇందులో రూ.250తో అకౌంట్ ఓపెన్ చేయొచ్చు. ప్రతి సంవత్సరం వెయ్యి రూపాయల నుంచి రూ.1.5 లక్షల వరకు డిపాజిట్ చేయొచ్చు. అదనంగా పన్ను మినహాయింపులు కూడా ఉంటాయి.
5. నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్: పోస్టల్ సేవింగ్స్‌లో నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ (ఎన్ఎస్సీ) మంచి పెట్టుబడి ఎంపిక. ఈ పథకంలో మెచూరిటీ ఐదు సంవత్సరాలు. ఎన్ఎస్సీపై ప్రస్తుత వడ్డీ రేటు 6.8శాతంగా ఉంది. ఈ వడ్డీ ప్రతి సంవత్సరం పెరుగుతుంది.

0 comments:
Post a comment