Samsung F41: సాంసంగ్ ఫస్ట్ 'ఎఫ్' సిరీస్ స్మార్ట్‌ఫోన్ లాంచ్.. ధర, బుకింగ్స్ వివరాలు...
Samsung Galaxy F41 Price, Release Date: ప్రముఖ మొబైల్ తయారీ కంపెనీ సాంసంగ్ భారత మార్కెట్లోకి వరుస స్మార్ట్ఫోన్లను విడుదల చేస్తూ దూకుడు మీద ఉంది. ఇటీవల సాంసంగ్ ప్రకటించిన ఎఫ్ సిరీస్‌లో భాగంగా సాంసంగ్ గెలాక్సీ ఎఫ్ 41 పేరుతో మొట్టమొదటి స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ కానుంది. ఈ ఫోన్‌ను అక్టోబర్ 8న భారత మార్కెట్లోకి విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తుంది. తాజాగా దీనికి సంబంధించిన అప్డేట్ను ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ ఫ్లిప్‌కార్ట్ ప్రకటించింది. ఇప్పటికే ఏ, ఎస్, ఎం సిరీస్‌లో స్మార్ట్ఫోన్లను రిలీజ్ చేసింది సాంసంగ్. అయితే, ఇప్పుడు కొత్తగా గెలాక్సీ ఎఫ్ సిరీస్ స్మార్ట్ఫోన్లను కూడా పరిచయం చేయనుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 6,000 ఎంఏహెచ్ బ్యాటరీ, సూపర్ అమోలెడ్ ఇన్ఫినిటీ-యు డిస్ప్లే, ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, వెనుక భాగంలో ఫింగర్ ప్రింట్ స్కానర్ వంటివి ఉండనున్నాయని ఫ్లిప్‌కార్ట్ తన టీజర్ పేజీలో పేర్కొంది.
గెలాక్సీ ఎఫ్ 41 మేడ్ ఇండియా కార్యక్రమంలో భాగంగా రూపొందించామని కంపెనీ తెలిపింది. కాగా దీనికి సంబంధించి సాంసంగ్ ఇండియా సపోర్ట్ పేజీలో గత వారం యూజర్ మాన్యువల్ పోస్ట్ చేయబడింది. దీని ప్రకారం, ఈ ఫోన్ వైడ్, అల్ట్రావైడ్ కెమెరా వంటి అట్రాక్టివ్ ఫీచర్లతో రానుంది. వాటిలో ప్రైమరీ కెమెరా 64 మెగా పిక్సెల్ రిజల్యూషన్‌తో, ఫ్రంట్ లేదా సెల్ఫీ కెమెరా 32 మెగాపిక్సెల్‌తో రానుంది.
ఫోన్ మోడల్ సంఖ్య SM-F415F గా పేర్కొంది సాంసంగ్. దీనిలో యూఎస్బీ టైప్-సి పోర్ట్, 3.5 ఎంఎం హెచ్‌ఫోన్ జాక్, సింగిల్ బాటమ్ ఫైరింగ్ స్పీకర్, ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటుందని వెల్లడించింది.గెలాక్సీ ఎఫ్ 41 ఆక్టా-కోర్ ఎక్సినోస్ 9611 చిప్ సెట్‌తో పనిచేస్తుంది. ఇది 6 జీబీ ర్యామ్, ఆండ్రాయిడ్ 10 ఆపరేటింగ్ సిస్టమ్‌తో రన్ అవుతుంది. వాటర్ డ్రాప్ నాచ్ అమోల్డెడ్ ప్యానల్‌తో వచ్చే ఈ స్మార్ట్‌ఫోన్ 1080 x 2340 పిక్సెల్స్ స్క్రీన్ రిజల్యూషన్ కలిగి ఉంటుంది. సాంసంగ్ గెలాక్సీ ఎఫ్ 41 ధరను అధికారింగా వెల్లడించనప్పటికీ రూ.15 వేల నుంచి రూ. 20,000 మధ్య ఉండే అవకాశం ఉందని టెక్ నిపుణులు అంచనా వేస్తున్నారు.

0 comments:
Post a comment