Revised Key - Grama Sachivalayam Exam Answer Key: సచివాలయ ఉద్యోగాల పరీక్ష 'కీ' వెనక్కి... మరోసారి విడుదల
ఆంధ్రప్రదేశ్లో గ్రామ, వార్డు సచివాలయాల్లో 16,208 ఖాళీల భర్తీకి పరీక్షల్ని నిర్వహించింది ఏపీ ప్రభుత్వం. ఈ పరీక్షలకు సంబంధించిన ఆన్సర్ కీని సెప్టెంబర్ 26న విడుదల చేసింది ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్-APPSC. అయితే సాంకేతిక కారణాల వల్ల సెప్టెంబర్ 26న విడుదల చేసిన కీని వెనక్కి తీసుకుంటున్నామని, మరోసారి కీని విడుదల చేస్తామని, అభ్యర్థులు తమ అభ్యంతరాలు తెలిపేందుకు మూడు రోజులు గడువు ఇస్తామని ఏపీపీఎస్సీ తెలిపింది. సెప్టెంబర్ 20 నుంచి 26 వరకు గ్రామ సచివాలయం, వార్డు సచివాలయాల్లో ఖాళీగా ఉన్న 16,208 పోస్టుల భర్తీకి పరీక్షలు జరిగాయి. పరీక్షలు పూర్తి కాగానే ఏపీపీఎస్సీ కీని http://gramasachivalayam.ap.gov.in/ వెబ్సైట్లో అప్లోడ్ చేసింది.
కానీ సాంకేతిక కారణాలతో వెనక్కి తీసుకోవాల్సి వచ్చింది. అభ్యర్థులు ఆన్సర్ కీ కోసం http://gramasachivalayam.ap.gov.in/ వెబ్సైట్ ఫాలో కావాలి.
సాధారణంగా పరీక్షలు పూర్తైన వెంటనే ఎగ్జామ్స్ నిర్వహించిన సంస్థలు ఆన్సర్ కీ విడుదల చేస్తాయి. అభ్యర్థులు కీ చెక్ చేసి ప్రశ్నలకు తాము సరైన సమాధానాలు రాశామో లేదో చెక్ చేసుకోవచ్చు. అంతే కాదు... అసలు పరీక్షల్లో ఇచ్చిన ప్రశ్నల్లోనే ఏవైనా తప్పులు ఉన్నట్టైతే పరీక్ష నిర్వహించిన ఏజెన్సీ దృష్టికి తీసుకురావొచ్చు. తమ అభ్యంతరాలు నిజమేనని నిరూపించే ఆధారాలను కూడా సమర్పించాల్సి ఉంటుంది. ఆన్సర్ కీ పైన అభ్యంతరాల స్వీకరణ, పరిశీలన పూర్తైన తర్వాత తుది కీ విడుదలవుతుంది. ఒకవేళ ప్రశ్నలే తప్పైతే ఆ ప్రశ్నల్ని తొలగించడమో లేదా వాటికి గ్రేస్ మార్క్స్ ఇవ్వడమో సాధారణంగా జరిగే ప్రక్రియ.
ఆంధ్రప్రదేశ్లో గ్రామ, వార్డు సచివాలయాల్లో మొదటి విడత ఉద్యోగాల భర్తీ గతేడాది పూర్తైంది. అయితే ఉద్యోగాల్లో చేరినవారు మానెయ్యడం, ఉద్యోగాల్లో చేరకపోవడం లాంటి కారణాల వల్ల 16,208 ఖాళీలు ఏర్పడ్డాయి. ఈ ఖాళీల భర్తీ ప్రక్రియ ఇప్పుడు కొనసాగుతోంది. పరీక్షలు పూర్తయ్యాయి. ఫలితాల విడుదల తర్వాత ఇంటర్వ్యూ ఉంటుంది.

0 comments:
Post a comment