Reliance Jio సంస్థ JioPhoneని విడుదల చేసిన సమయంలో స్మార్ట్ఫోన్ యుగంలో ఫీచర్ ఫోన్ ఎవరు వాడతారు అనే సందేహాలు చాలా మందిలో వ్యక్తమయ్యాయి. అయితే అందరి అంచనాలను తలకిందులు చేస్తూ JioPhone అనూహ్యంగా విజయవంతమైన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో Reliance Jio సంస్థ మరోసారి సంచలనాలకు శ్రీకారం చుట్టబోతోంది. ఏకంగా 10 కోట్ల చవక Android phoneలను రూపొందించడం కోసం ఆ సంస్థ సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. పెద్దగా ఆర్థిక స్తోమత లేని వినియోగదారులకు వీటిని అందుబాటులో ఉంచబోతున్నారు. కేవలం మొబైల్ ఫోన్ మాత్రమే కాకుండా, JioPhoneలో ఎలాగైతే డేటా సేవలు కూడా అందించబడ్డాయో అదేవిధంగా మొబైల్ డేటా కూడా కలిపి ఈ ఫోన్లని వినియోగదారులకు అందుబాటులోకి తీసుకు వస్తారు.
తక్కువ ధర కలిగిన Android phoneల విషయంలో ప్రస్తుతం భారతీయ మార్కెట్లో చైనాకు చెందిన Xiaomi, Realme, Oppo, Vivo వంటి సంస్థలు భారీ మొత్తంలో మార్కెట్ షేర్ కలిగి ఉన్నాయి. వాటికి పోటాపోటీగా Reliance Jio కొత్త బడ్జెట్ ఫోన్ తీసుకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. పది వేల రూపాయల ధర లో Android Go ఆపరేటింగ్ సిస్టమ్ ఆధారంగా Jio తీసుకు వచ్చే Android phone ఉండే అవకాశం ఉంది.
కొత్తగా ఒక స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేయడానికి పెద్ద మొత్తంలో వెచ్చించలేని గ్రామీణ ప్రాంత వినియోగదారులకు, పేద వర్గాలకు ఇది అనుకూలంగా ఉంటుంది అనడంలో సందేహమే లేదు. ఈ కొత్త ఫోన్ లో Whatsapp, Youtube, Facebook వంటి అన్ని ముఖ్యమైన అప్లికేషన్స్ తో పాటు Google Play Store నుండి కావలసిన అప్లికేషన్స్ డౌన్లోడ్ చేసుకునే వెసులుబాటు కూడా ఉంటుంది. ఇప్పటివరకు JioPhoneలో KaiOS ఉపయోగించబడి ఉంటే, ఇటీవల గూగుల్ సంస్థ జియో లో కొంత వాటా కొనుగోలు చేసిన నేపథ్యంలో ఇక మీదట ఏకంగా Android ఆపరేటింగ్ సిస్టమ్ ఆధారంగా phoneలను తీసుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. డిసెంబర్ 2020లో ఇది అధికారికంగా ప్రకటించబడుతుందని తెలుస్తోంది.

0 comments:
Post a comment