Redmi 9i: కాసేపట్లో రెడ్మీ 9ఐ రిలీజ్... ధర, స్పెసిఫికేషన్స్ ఇవే
షావోమీ నుంచి రెడ్మీ 9 సిరీస్‌లో మరో స్మార్ట్‌ఫోన్ రాబోతోంది. రెడ్మీ 9ఐ మోడల్‌ను రిలీజ్ చేయనుంది షావోమీ. ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకు ఈ కొత్త మోడల్‌ను పరిచయం చేయనుంది. ఇప్పటికే రెడ్మీ 9 సిరీస్‌లో రెడ్మీ 9, రెడ్మీ 9ఏ, రెడ్మీ 9 ప్రైమ్, రెడ్మీ నోట్ 9, రెడ్మీ నోట్ 9 ప్రో, రెడ్మీ నోట్ 9 ప్రో మ్యాక్స్ మోడల్స్‌ని రిలీజ్ చేసింది. ఇప్పుడు ఇదే సిరీస్‌లో రెడ్మీ 9ఐ రిలీజ్ చేయనుంది. ఇప్పటికే ఈ ఫోన్‌కు సంబంధించిన స్పెసిఫికేషన్స్ కొన్ని ప్రచారంలో ఉన్నాయి. ధర వివరాలు కూడా లీక్ అయ్యాయి. రెడ్మీ 9ఐ స్మార్ట్‌ఫోన్ 4జీబీ+64జీబీ, 4జీబీ+128జీబీ వేరియంట్స్‌లో రిలీజ్ కానుంది. రెడ్మీ 9ఏ ప్రారంభ ధర రూ.6,799 కాగా, రెడ్మీ 9 ప్రారంభ ధర రూ.8,999. అయితే రెడ్మీ 9ఐ ప్రారంభ ధర రూ.7,999 కావచ్చని ప్రచారం జరుగుతోంది.
రెడ్మీ 9ఏ స్మార్ట్‌ఫోన్ లాగానే రెడ్మీ 9ఐ కూడా మిడ్నైట్ బ్లాక్, సీ బ్లూ, నేచర్ గ్రీన్ కలర్స్‌లో రానుంది. అయితే ఇందులో ప్రాసెసర్ ఏది ఉంటుందో, బ్యాటరీ కెపాసిటీ ఎంతో, కెమెరా స్పెసిఫికేషన్స్ ఎలా ఉంటాయో తెలియాల్సి ఉంటుంది. ఈ ఫోన్ గురించి కొంతకాలంగా టీజర్స్ రిలీజ్ చేస్తున్నా ఎక్కడా స్పెసిఫికేషన్స్ మాత్రం వెల్లడించలేదు. అయితే పెద్ద డిస్ప్లే, భారీ బ్యాటరీ, వాటర్ డ్రాప్ స్టైల్ నాచ్ ఉంటాయి. రియల్‌మీకి గట్టి పోటీ ఇస్తున్న షావోమీ 6,000 ఎంఏహెచ్ భారీ బ్యాటరీతో ఈ ఫోన్ రిలీజ్ చేసే అవకాశముంది. మరి ఈ ఫోన్ స్పెసిఫికేషన్స్, ధర వివరాలు తెలియాలంటే ఇంకొద్దిసేపు ఆగాల్సిందే.

0 comments:
Post a comment