New medicine from Reddy's for Corona ..!
కరోనాకు రెడ్డీస్ నుండి కొత్త ఔషధం..!
కరోనా నివారణకు దేశీయ ఫార్మా దిగ్గజం డాక్టర్ రెడ్డీస్ లాబోరేటరీస్ కొత్త ఔషధాన్ని తీసుకువచ్చింది. కరోనా చికిత్స కోసం 'రెడిక్స్' బ్రాండ్ పేరుతో ఔషధాన్ని అందుబాటులోకి తీసుకువచ్చినట్టు ఓ ప్రకటనలో పేర్కొంది. ఈ సంధర్భంగా కంపెనీ బ్రాండెడ్ మార్కెట్స్ సీఈఓ ఎంవీ రమణ మాట్లాడుతూ.... కరోనా రోగుల అవసరాలను తీర్చగల ఉత్పత్తుల అభివృద్ధిలో తమ ప్రయత్నాలను కొనసాగిస్తామన్నారు. రోగులకు క్లిష్టమైన ఔషధం రెడిక్స్ ను తీసుకురావడం తమ నిబద్ధతను పునరుద్ఘాటిస్తుందని తెలిపారు. ఇదిలా ఉండగా రెమ్డెసివిర్ సంస్థ గిలియడ్ సైన్సెస్ తో డా.రెడ్డీస్ చేసుకున్న ఒప్పందం ప్రకారం 127 దేశాల్లో ఈ డ్రగ్ తయారీకి మరియు విక్రయించడానికి అనుమతి ఉంది.
రెమ్డెసివిర్ ఔషధాన్ని డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) తీవ్రమైన లక్షణాలు గల కరోనా రోగులకు చికిత్స అందించడానికి అనుమతిచ్చింది.
0 comments:
Post a comment