Movie star Jayaprakash Reddy (74) has passed away.
సినీ నటుడు జయప్రకాశ్ రెడ్డి(74) కన్నుమూశారు. మంగళవారం తెల్లవారుజామున గుండెపోటుతో బాత్రూమ్లోనే కుప్పకూలిపోయారు. కుటుంబ సభ్యులు ఆయన్ని ఆస్పత్రికి తీసుకెళ్లగా ఆయన చనిపోయినట్లు నిర్ధారించారు. కరోనా కారణంగా సినీమా షూటింగ్‌లపై ప్రభుత్వం నిషేధించడంతో ఆయన గుంటూలో ఉంటున్నారు.
జయప్రకాశ్‌రెడ్డి స్వస్థలం కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ మండలం సిరివెళ్ల. 1946 అక్టోబరు 10న జయప్రకాశ్‌రెడ్డి జన్మించారు..
కాగా, జయప్రకాష్ రెడ్డి నల్గొండలో గప్ చుప్ అనే నాటకాన్ని ప్రదర్శిస్తుండగా దాసరి నారాయణరావుకు అతని నటన నచ్చి నిర్మాత రామానాయుడుకు పరిచయం చేశాడు.
అలా ఈయన 1988లో విడుదలైన బ్రహ్మపుత్రుడు చిత్రంతో తెలుగు సినీరంగానికి పరిచయమయ్యాడు.
అయితే, 1997 లో విడుదలైన ప్రేమించుకుందాం రా చిత్రం ప్రతినాయకునిగా ఇతనికి మంచి పేరు తీసుకునివచ్చింది. ఇక ఆ తర్వాత విలన్‌గా, కమెడియన్‌గా మంచి పేరు సంపాదించుకున్నారు. ఈయన చివరిసారిగా మహేష్ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరులో ఆయన కనిపించారు.
జయప్రకాశ్ రెడ్డి మరణ వార్త పట్ల సినీ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

0 comments:
Post a comment