తినడం మానేస్తే బరువు తగ్గిపోతామని చాలా మంది అనుకుంటారు. అది నిజం కాదు. చెప్పాలంటే... సరైన ఆహారం తింటే... ఆటోమేటిక్‌గా బరువు తగ్గగలరు. ఐతే... ఎక్సర్సైజ్, వర్కవుట్ వంటివి తప్పనిసరిగా చెయ్యాలి. అలాగని అతిగా వర్కవుట్స్ చేయడం కూడా కరెక్టు కాదు. ఎక్కువ వర్కవుట్స్ వల్ల బరువు తగ్గడం సంగతేమోగానీ... నీరసం, డీహైడ్రేషన్ వంటివి వచ్చేస్తాయి. ఆకలి పెరిగి... ఇదివరకటి కంటే ఎక్కువ తినేస్తారు. అందుకే... ఏం తినాలి, ఎంత తినాలి వంటి విషయాలపై మంచి అవగాహన తెచ్చుకుంటే... ఆరోగ్యాన్ని కాపాడుకోగలం. అందుకోసం ఏం చెయ్యాలో, ఎలాంటి ప్లాన్ వేసుకోవాలో ఓసారి తెలుసుకుందాం.
బరువు తగ్గాలంటే... ప్రోటీన్స్ ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవాలి.
ఎందుకంటే... ప్రోటీన్స్ త్వరగా జీర్ణం కావు. వాటిని జీర్ణం చేయించేందుకు మన బాడీ ఎక్కువ కేలరీలను వాడుతుంది. అందువల్ల బరువు తగ్గుతారు. ఫ్యాట్స్, కార్బోహైడ్రేట్స్ కంటే... ప్రోటీన్స్... ఎక్కువ సేపు ఆకలి లేకుండా చేస్తాయి. గుడ్లు, యోగర్ట్, మిల్క్ షేక్స్ వంటివి ప్రోటీన్స్ ఎక్కువగా ఉండే బ్రేక్ ఫాస్ట్. బ్రేక్ ఫాస్ట్ ఎక్కువగా తినడమే మంచిదని డాక్టర్లు సూచిస్తున్నారు. ఒక్కటే మాట. షుగర్ ఎంత తక్కువ తీసుకుంటే అంత మేలు. షుగర్ బదులు నల్ల బెల్లం వాడటం ఇంకా మేలు. కూల్ డ్రింక్స్, షుగర్ కలిపిన ఫ్రూట్ జ్యూస్‌ల వంటివి వీలైనంతగా తగ్గించెయ్యాలి. టెట్రా ప్యాకెట్స్‌లో ఉన్నది 100 శాతం రియల్ ఫ్రూట్ జ్యూస్ అని చెబుతుంటాయి కంపెనీలు. అది నిజం కాదు. 100 శాతం జ్యూ్స్ వాడితే... అది నిల్వ ఉండదు. కాబట్టి... మాగ్జిమం 24 శాతం ఒరిజినల్ జ్యూస్, మిగతావి సింథటిక్ కలర్స్, షుగర్, కెమికల్స్ వంటివి వాడుతుంటారు. సపోజ్ మీరు రూ.60 పెట్టి ఓ లీటర్ జామకాయ జ్యూస్ టెట్రాప్యాకెట్ కొంటే... అందులో మీకు లభించే ఒరిజినల్ జ్యూస్... 200ml ఉంటుందనుకోవచ్చు. మిగతాదంతా షుగర్, కలర్సే కాబట్టి... అవి మీకు మేలు చెయ్యవు. అదే రూ.60 పెట్టి మీరు జామకాయలే కొనుక్కుంటే... మీకు కనీసం కేజీ అయినా వస్తాయి. అంటే... మీకు నాలుగు రెట్లు ఎక్కువ ప్రయోజనం కలుగుతుంది. ఒరిజినల్ జామ తింటే ఆరోగ్యానికీ ఎంతో మేలు. టెట్రాప్యాకెట్లలో జ్యూస్ తాగితే... బరువు తగ్గాలనే ఆలోచన విరమించుకోవడం బెటర్.
రోజంతా నీరు తాగుతూనే ఉండాలి. ఫలితంగా బరువు తగ్గుతారు. పైగా... చర్మం ఆరోగ్యంగా ఉండి మెరుస్తుంది. సాధారణంగా బ్రేక్ ఫాస్ట్ తర్వాత మనం ఏమీ తినం. భోజనానికి అరగంట ముందు మంచినీళ్లు తాగితే... ఆహారం చక్కగా జీర్ణమవుతుంది.
మన శరీరాన్ని క్రమపద్ధతిలో ఉంచడానికి కెఫైన్ ఉండే కాఫీ, టీ వంటివి తాగడం మేలే. ఐతే... వీటిని మరీ ఎక్కువగా తాగకూడదు. ముఖ్యంగా కాఫీ రోజుకు రెండు కంటే ఎక్కువ కప్పులు తాగకపోవడం మేలు.
తినే ఆహారానికి సంబంధించి కచ్చితమైన వీక్లీ ఫుడ్ ప్లాన్ వేసుకోండి. ఉదయం వేళ రోజుకో రకం బ్రేక్ ఫాస్ట్ తీసుకోండి. వారంలో ఒక్క రోజైనా గుడ్లు, మరో రోజు మాంసం లేదా చేపల వంటివి తినేలా ప్లాన్ వేసుకోండి. అలాగే ఆకుకూరలు, కూరగాయలు తప్పనిసరిగా డైట్లో ఉండాలి. మంచి ఆహార ప్రణాళికతో అధిక బరువు సమస్యను ఈజీగా తొలగించుకోవచ్చు.

0 comments:
Post a comment