Land Reservay from January 1st
జనవరి 1 నుంచి భూముల రీసర్వే
ఈనాడు-అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా వచ్చే ఏడాది జనవరి 1 నుంచి సమగ్ర భూ సర్వే ప్రారంభించాలని ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. 2023 ఆగస్టు నాటికి ఈ ప్రక్రియ పూర్తయ్యేలా కార్యాచరణ సిద్ధం చేయాలని సూచించారు. కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం తక్కెళ్లపాడులో ప్రయోగాత్మకంగా నిర్వహించిన భూముల రీసర్వే వివరాలను అధికారులు సోమవారం సీఎంకు తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో వివరించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ ‘రీసర్వే పట్టణ ప్రాంతాలతో పాటు మండలాల్లోనూ ఒకేసారి చేపట్టాలి. ఇందుకు 4,500 బృందాలు ఏర్పాటుచేయాలి. సర్వే రాళ్లు ప్రత్యేక డిజైనులో ఉండాలి. ప్రక్రియ ప్రారంభం నాటికే అవసరమైన పరికరాలు, డ్రోన్లు, బేస్స్టేషన్లు, మొబైల్ ట్రైబ్యునల్స్, సర్వే బృందాలకు అవసరమైన వాహనాలు సమకూర్చాలి. ఈ పరికరాలతో పాటు సబ్ రిజిస్ట్రార్ సేవలు గ్రామ సచివాలయానికి అందుబాటులో ఉండాలి. సర్వేయర్లకు శిక్షణ ఇవ్వాల’ని ఆదేశించారు.
0 comments:
Post a comment