It has decided to provide pension to the elderly and the disabled across the state not only through biometric system but also through facial recognition.
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వికలాంగులు వృద్ధులు అందరికీ వైఎస్ఆర్ ఆసరా కింద జగన్ సర్కార్ పింఛన్ అందజేస్తున్న విషయం తెలిసిందే. పింఛన్ దారులు అందరూ బయోమెట్రిక్ విధానం ద్వారా వేలి ముద్రలు వేసి పించన్లు తీసుకుంటున్నారు. ఇక ఈ బయోమెట్రిక్ విధానం ద్వారా ఇబ్బందులు తలెత్తుతున్నాయని తద్వారా అక్రమాలు జరుగుతున్నాయి అంటూ విమర్శలు వస్తున్న నేపథ్యంలో దీనిపై జగన్ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది.
ఇక ఈ బయోమెట్రిక్ విధానం ద్వారా కొన్ని కొన్ని సార్లు సరిగా పనిచేయక పోవడంతో ఎంతో మంది వృద్ధులు వికలాంగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అంతేకాకుండా అక్రమాలు పెరిగిపోతున్నాయి అనే దానిపై పునరాలోచన చేసిన జగన్ సర్కార్ ఇక నుంచి కేవలం బయోమెట్రిక్ విధానం ద్వారా నే కాదు ముఖ గుర్తింపు ద్వారా కూడా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వృద్ధులు వికలాంగులకు పింఛన్ అందజేసేందుకు నిర్ణయం తీసుకుంది.
ఇది నిజంగా శుభవార్తే అని చెప్పాలి.
0 comments:
Post a comment