ముంచుకొస్తున్న అల్పపీడనం.. వర్షాలు కురిసేది ఇక్కడే....
Heavy Rains : వరుస అల్పపీడనాలతో తెలుగు రాష్ట్రాలు తడిసి ముద్దవుతున్నాయి. ఇప్పుడు మరో అల్పపీడనం ముంచుకొస్తోంది. ఆంధ్రప్రదేశ్ తీరానికి దగ్గరలో పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఈనెల 13న అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. ప్రస్తుతం కర్ణాటక వద్ద అరేబియా సముద్రంలో ఉపరితల ఆవర్తనం 2.1 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతోందని వారు పేర్కొన్నారు.
దీనిప్రభావంతో రానున్న నాలుగు రోజులు రాష్ట్రవ్యాప్తంగా అక్కడక్కడ భారీ వర్షాలు, అనేక చోట్ల ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఉరుములు, మెరుపులు కూడా ఉంటాయని వెల్లడించింది.
కాగా, తూర్పు-పడమర గాలుల వల్ల రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో ఎండ తీవ్రత కూడా అధికంగా ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది.
పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2-3 డిగ్రీలు ఎక్కువగా నమోదయ్యాయి. అయితే అక్కడక్కడ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడుతున్నాయి.

0 comments:
Post a comment