Flax Seeds Health: అవిసె గింజల డ్రింక్... తాగితే అద్భుత ప్రయోజనాలు
Flax Seeds : మీకు తెలుసా... 100 గ్రాముల అవిసె గింజల్లో 18 గ్రాముల ప్రోటీన్స్ ఉంటాయని. ప్రోటీన్స్ ఉన్న ఆహారం తింటే... కొద్దిగా తిన్నా చాలు... పొట్ట నిండిపోయిన ఫీల్ కలుగుతుంది. అందువల్ల ఎక్కువ ఆహారం తినబుద్ధి కాదు. ఫలితంగా బరువు తగ్గేందుకు వీలవుతుంది. అందువల్ల బరువు తగ్గాలనుకునేవారికి ఇవి బాగా పనిచేస్తాయి. మీరు ఆల్రెడీ ఆరోగ్యంపై ఎక్కువ శ్రద్ధ పెడుతున్నవారైతే... అవిసె గింజల గురించి మీరు ఆల్రెడీ వినే ఉంటారు. ఈ రోజుల్లో ఈ గింజల్ని ప్రతీ స్మూతీలో, సలాడ్‌లో అన్నింటిలోనూ వాడుతున్నారు. అంతెందుకు... ఇండియాలో చలికాలంలో అల్సీ లడ్డూ (Alsi Ladoo)ను అవిసె గింజలు, నెయ్యితో తయారుచేస్తారు. ఈ లడ్డూలు తింటే... చలి నుంచీ కొంత ఉపశమనం కలుగుతుంది.
పోషకాలు ఎక్కువగా ఉండే అవిసె గింజలు... గుండెకు మేలు చేస్తాయి. బ్లడ్ షుగర్ లెవెల్స్‌ని కంట్రోల్ చేస్తాయి. వీటిలోని ఫైబర్... జీర్ణక్రియను క్రమబద్దీకరిస్తుంది. ప్రోటీన్స్, ఫైబర్తోపాటూ... ఆరోగ్యకరమైన ఒమేగా-3 ఫాటీ యాసిడ్స్ ఉండటంతో... అవిసె గింజల్ని సూపర్ ఫుడ్‌గా, బరువు తగ్గించే ఆహారంగా చెబుతున్నారు.
Flaxseeds For Weight Loss : మామూలుగా మాంసకృత్తులు (ప్రోటీన్స్) మాంసాహారంలో ఉంటాయి. మొక్కల నుంచీ వచ్చే ప్రోటీన్స్‌లో అవిసె గింజలు చెప్పుకోతగ్గవి. ప్రోటీన్స్ వల్ల ఆకలి తగ్గిపోతుంది. ఫలితంగా ఎక్కువ ఆహారం తినం కాబట్టి... అధిక బరువు సమస్య కొంత వరకూ తీరుతుంది. ఫైబర్ వల్ల కూడా మరో ప్రయోజనం ఉంది. ఇది ఆహారాన్ని త్వరగా జీర్ణం అయిపోనివ్వకుండా... నెమ్మదిగా జీర్ణం అయ్యేలా చేస్తుంది. అందువల్ల కూడా వెంటనే ఆకలి కాదు. అందుకే అధిక బరువుతో ఇబ్బంది పడేవారు... ఫ్లాక్స్ సీడ్స్ డ్రింక్ తాగాలని డాక్టర్లు సూచిస్తున్నారు.డ్రింక్ తయారీ విధానం : అవిసె గింజల్ని నీటిలో నానబెట్టి... మొలకలుగా తినవచ్చు. అలా కాదనుకుంటే... గుప్పెడు అవిసె గింజల్ని నీటితో శుభ్రం చేసి... వాటిని ఓ 200 గ్రాముల నీటిలో నానబెట్టాలి. ఇలా ఓ 7 గంటలు నాన బెట్టాక... ఆ నీటిని వడగట్టి తాగేస్తే చాలు. ఈ నీటిలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. అలాగే కేలరీలు తక్కువగా ఉంటాయి.

0 comments:
Post a comment