Exam room details on JEE hall ticket
జేఈఈ హాల్‌టికెట్‌పైనే పరీక్ష గది వివరాలు
❇️కరోనా నేపథ్యంలో పరీక్ష కేంద్రాల బయట బోర్డు వద్ద విద్యార్థులు గుమిగూడటాన్ని నిరోధించేందుకు నూతన విధానాన్ని ఈ నెల 27న జరిగే జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో అమలు చేయబోతున్నారు. విద్యార్థుల హాల్టికెట్లోనే పరీక్ష కేంద్రంలో ఏ గది/ల్యాబ్‌లో సీటు కేటాయించారో వివరాలు పొందుపరిచారు.
❇️పరీక్ష కేంద్రంలోకి వెళ్లిన తర్వాత సిబ్బంది హాల్‌టికెట్‌ను స్కానింగ్ చేసి విద్యార్థికి కేటాయించిన కంప్యూటర్ ఏ ల్యాబ్‌లో ఉందో చెబుతారు. మరోవైపు అడ్వాన్స్‌డ్‌కు 1,60,831 మంది తమ పేర్లను నమోదు చేసుకున్నా వారిలో రుసుం చెల్లించింది 1,55,511 మందే. వారే పరీక్ష రాయాల్సి ఉంటుంది. అందులో తెలుగు రాష్ట్రాల నుంచి దాదాపు 30 వేల మంది ఉంటారని అంచనా.
0 comments:
Post a comment