రేషన్ షాపుల వద్దనే ఈ-కేవైసీ నమోదు
రోజుకు రెండు గంటలపాటు అందుబాటులో వలంటీర్లు
అమరావతి: బియ్యం కార్డులో పేరున్న ప్రతి ఒక్కరూ ఈ-కేవైసీ
వివరాలను నమోదు చేయించుకోవాలని గతంలో అధికారుల ప్రకటనతో మీ-సేవా కేంద్రాల వద్దకు లబ్ధిదారులు ఉరుకులు పరుగులు పెట్టేవారు.
దీనివల్ల వారు పడుతున్న ఇబ్బందులను గమనించిన ప్రభుత్వం ఈ-కేవైసీ లబ్దిదారుల ఇళ్ల వద్దే తీసుకునేలా చర్యలు చేపట్టింది.
ఈ మేరకు గ్రామ, వార్డు వలంటీర్లు లబ్ధిదారుల ఇళ్ల వద్దకు వెళ్లి ఈ-కేవైసీ కోసం బయోమెట్రిక్ తీసుకునేవారు. కొన్ని కారణాల వల్ల
లబ్ధిదారులు ఇళ్ల వద్ద అందుబాటులో లేకపోవడంతో ఈ-కేవైసీ పూర్తి స్థాయిలో నమోదు చేయలేకపోయారు.
ఈ నేపథ్యంలో రేషన్ షాపుల వద్ద ఈ-కేవైసీ నమోదు చేసుకునేలా చర్యలు తీసుకున్నారు. ఇందులో భాగంగా బయోమెట్రిక్ తీసుకునేందుకు వలంటీర్లకు ప్రత్యేకంగా రేషన్ షాపుల వద్ద డ్యూటీ వేశారు.
ఆయా రేషన్ షాపుల పరిధిలో ఉన్న వాలంటీర్లు రోజుకు రెండు గంటల పాటు అందుబాటులో ఉండేలా అధికారులు ఆదేశించారు. ఆ మేరకు వలంటీర్లు కొన్ని రోజులుగా రేషన్
షాపుల వద్దే ఉంటూ ఈ-కేవైసీ తీసుకుంటున్నారు.
ప్రత్యేక Software తో స్మార్ట్ ఫోన్ ద్వారా లబ్ధిదారుల నుంచి బయోమెట్రిక్ సేకరిస్తున్నారు.
బియ్యం కార్డులో పేర్లు నమోదై ఉన్న ప్రతి ఒక్కరూ ఆధార్ అనుసంధానంతోపాటు ఈ-కేవైసీ తప్పనిసరి.
రాష్ట్రంలో ప్రస్తుతం 1,50,80,690 కార్డులున్నాయి.
కార్డుల్లో 4,42,76,504 మంది పేర్లు నమోదై ఉన్నాయి
ఇప్పటికే 75% ఈ-కేవైసీ తీసుకున్నారు.

0 comments:
Post a comment