త్వరలో డీఎస్సీ-2020 నోటిఫికేషన్!
వచ్చే అవకాశముందన్న ఏపీ మంత్రి సురేశ్
అమరావతి: డీఎస్సీ-2018లో ఉత్తీర్ణులైన ఎస్జీటీ అభ్యర్థులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. దీనిపై కోర్టుల్లో ఉన్న వివాదం పరిష్కారమైందని.. 3,524 పోస్టులకు నియామక ప్రక్రియ మొదలుపెట్టినట్లు ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ తెలిపారు. అమరావతిలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇప్పటికే సుమారు 2,200పైగా అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన పూర్తి చేశామన్నారు.
ఈనెల 24న ఎంపికైన అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన జరుగుతుందని చెప్పారు. అనంతరం వారికి నియామక ఉత్తర్వులు అందజేస్తామన్నారు. టెట్ సిలబస్‌ను ఆధునీకరించి పరీక్ష నిర్వహిస్తామని మంత్రి స్పష్టం చేశారు. త్వరలో డీఎస్సీ-2020 నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశముందని మంత్రి తెలిపారు.

0 comments:
Post a comment