ఆంగ్లం పై అయోమయం
💥 ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాలపై స్పష్టత కరువు.
💥దిక్కు తోచని స్థితిలో ప్రధానోపాధ్యాయులు.
✰ ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమ ప్రవేశాలపై అయోమయం నెలకొంది.
✰ ప్రభుత్వం కొత్తగా తెరపైకి తెచ్చిన ఇంగ్లీష్ మీడియంపై ప్రధానోపాధ్యాయులకు స్పష్టత కరువైంది.
✰ 2020-2021 విద్యా సంవత్సరానికి 1 నుంచి 6వ తరగతి వరకు ఆంగ్ల మాధ్యమ ప్రవేశాలపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వలేదు.
✰ ఇప్పటికే కరోనాతో నామమాత్రంగా సాగుతున్న అడ్మిషన్ల ప్రక్రియకు ఇదిమరింత అడ్డంకిగా మారింది.
➪ స్పష్టత ఇవ్వని విద్యాశాఖ
✰ ప్రస్తుత విద్యా సంవత్సరం ఇంగ్లీష్ మీడియం అమలు విద్యా శాఖకు పెద్ద సవాల్ గా మారింది.
✰ వివాదాల నేపథ్యంలోనూ ఇంగ్లీష్ మీడియంపై ప్రభుత్వం ముందుకే అడుగులేస్తోంది.
✰ కోర్టులో ఎటూ తేలలేదు. విద్యా సంవత్సరం ప్రా రంభమవటంతో అడ్మిషన్లు చేయాలి.
✰ కరోనా కారణంగా ప్రభుత్వ స్కూళ్లలో ఈ ఏడాది అడ్మిషన్ల ప్రక్రియ అంతంతమాత్రంగా
ఉండగా.. ఇంగ్లీష్ మీడియం అడ్మిషన్లపై కొలిక్కి రాలేదు.
✰ అదే మీడియంలో పాఠ్యపుస్తకాలు ముద్రించారు.
✰ తెలుగు మాధ్యమం వారి కోసం బైలింగ్వల్ పుస్తకాలను అచ్చు వేశారు.
✰ ఇంగ్లీష్ మీడియంలో అడ్మిషన్లపై అధికారికంగా ఉత్తర్వులు రాకపోవడంతో ప్రధానోపాధ్యాయులు, టీచర్లు అయోమ యంలో పడ్డారు.
➪ సందిగ్ధంలో టీచర్లు
✰ ఇంగ్లీష్ మీడియం కొత్తగా అమలు చేసే వేలాది స్కూళ్లలో ఈ ఏడాది అడ్మిషన్లు ఆయోమయానికి దారితీస్తున్నాయి.
✰ తెలుగు మీడియం విద్యార్థులకు ఏ సమస్యా ఉండదు.
✰ తల్లిదండ్రులు తమ పిల్లలను ఇంగ్లీష్ మీడియంలో చేర్చుకోవాలని కోరితే, అడ్మిషన్ ఫారంలో నమోదు చేయాలా, వద్దా అంటూ హెచ్ఎంలు, ఉపాధ్యాయులు తలలు పట్టుకుంటున్నారు.
✰ అధికారికంగా ఉత్తర్వులు లేకపోవడమే ఇందుకు కారణం.
✰ కొందరు ప్రధానోపాధ్యాయులు ఏం చేయాలో పాలుపోక అడ్మిషన్ ఫారాలను ఖాళీగా ఉంచుతున్నట్లు సమాచారం.
✰ విద్యాశాఖాధి కారులు సైతం ప్రభుత్వ పోకడ అర్ధంకాక కళ్లు తేలేస్తున్నారు.
0 comments:
Post a comment