Search This Blog

FLASH NEWS ⚡⚡⚡ ఫ్లాష్ న్యూస్...

  • Spoken English-books,Material NEW...
  • MORE TO VIEW

Tuesday, 22 September 2020

3,524 ఎస్జీటీ పోస్టులకు మోక్షం Completion of the recruitment Process to the Post of S.G.T in DSC- 2018 - Instructions

Completion of the recruitment Process to the Post of S.G.T in DSC- 2018 - Instructions


✨ డీఎస్సీ 2018 :: ఎస్జీటీ నియామకాలు
★ 2203 అభ్యర్థుల వెరిఫికేషన్ పూర్తయ్యింది.
★ మిగిలిన అభ్యర్థుల వెరిఫికేషన్ ఈ రోజుతో పూర్తి.
★ ఎస్జీటీ కేటగిరీ లో 3524 పోస్టుల భర్తీ ప్రక్రియ ప్రారంభించాం.
★ *ఈ నెల 25,26 తేదీలలో కౌన్సిలింగ్ నిర్వహిస్తాం.
★ రేపటి లోగా  అభ్యర్థులకు యస్.యం.యస్ ద్వారా సమాచారం.
★ అపాయింట్మెంట్ లెటర్లు కూడా అదే రోజు అందజేస్తాం.
★ *ఎంపికైన అభ్యర్థులు 28 తరువాత విధులలో చేరవచ్చు.
విద్యాశాఖ మంత్రి

డీఎస్సీ-2018 అభ్యర్థులకు రేపు సర్టిఫికెట్ల పరిశీలన
త్వరలో డీఎస్సీ-2020 నోటిఫికేషన్‌: మంత్రి సురేశ్‌

అమరావతి, సెప్టెంబరు 22(ఆంధ్రజ్యోతి): డీఎస్సీ-2018 నోటిఫికేషన్‌కు సంబంధించిన 3,524 సెకండరీ గ్రేడ్‌ టీచర్‌(ఎస్జీటీ) పోస్టుల భర్తీకి లైన్‌ క్లియరైంది. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న కేసులను హైకోర్టు కొట్టేయడంతో ఆ డీఎస్సీలో ఉత్తీర్ణులైన అభ్యర్థులతో నియామకాలు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విషయాన్ని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్‌ మంగళవారం మీడియాకు వెల్లడించారు. 3,524 ఎస్జీటీ పోస్టులకు నియామక ప్రక్రియ ప్రారంభించినట్లు తెలిపారు. 2,203 మంది అభ్యర్థుల వెరిఫికేషన్‌ ఇప్పటికే పూర్తి కాగా, మిగిలిన 1321 మంది అభ్యర్థులకు ఈనెల 23న ఎస్‌ఎంఎస్‌ చేస్తారన్నారు.
24న సర్టిఫికెట్ల పరిశీలన, 25-26 తేదీల్లో అభ్యర్థులకు కౌన్సెలింగ్‌ నిర్వహించి పోస్టింగ్‌ ఆర్డర్లు ఇస్తారన్నారు. ఎంపికైన అభ్యర్థులు ఈ నెల 28 నుంచి పాఠశాలల్లో విధుల్లో చేరుతారని చెప్పారు. మరో 949 పోస్టులకు భర్తీ ప్రక్రియ చేపట్టాల్సి ఉందని, 374 భాషా పండిట్లు(ఎ్‌సఏ), 486 పీఈటీ, పీడీ పోస్టులు, 89 ప్రిన్సిపాల్‌ పోస్టులకు కోర్టు కేసులకు లోబడి నియామకాలు చేపడతామన్నారు.
అలాగే, త్వరలో డీఎస్సీ-2020 నోటిఫికేషన్‌ విడుదల చేస్తామని చెప్పారు. స్పెషల్‌ డీఎస్సీతో పాటు పెండింగ్‌లో ఉన్న డీఎస్సీలకు సంబంధించి త్వరలో నియామక ప్రక్రియ చేపడతామన్నారు. ఇంటర్‌ విద్యలో సిలబస్‌ కుదించే ప్రయత్నం చేస్తామని చెప్పారు. ఉపాధ్యాయుల బదిలీలపై త్వరలో నిర్ణయం తీసుకుంటామన్నారు. కొత్త కాలేజీలకు అనుమతిచ్చిన తర్వాత ఆన్‌లైన్‌లో ఇంటర్‌ అడ్మిషన్లు చేపడతామన్నారు. ప్రైవేట్‌ స్కూళ్లు ఉపాధ్యాయులకు జీతాలివ్వకపోతే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.


0 comments:

Post a comment

Teachers INFO

  • SCERT - OFFICIAL - 10th class new pattern Model papers Latest
  • CLICK FOR MORE

Teachers News,Info

  • CCE Formative Assessment Tools and Guidelines for FA1, FA2, FA3, FA4 in AP Schools,FA Model papersLatest
  • CLICK FOR MORE
    Acadamic Reated Lables

District wise info

More
AP District wise updates

Pimary Classes TLM,Material

  • June Month Syllabus - 1 to 5th Telugu / English RhymesLatest
  • CLICK FOR MORE
    TLM For Primary Classes( 1 to 5th ) subject wise
    TLM For Class wise

High school -TLM,Material

CLICK FOR More

TLM @ High school classes(6 to 10th)Subject Wise
TLM , Studyy Material For High school classes

General Issues

CLICK FOR MORE
General Lables

Students Related Info

CLICK FOR MORE
STUENTS INFORMATION LABLES

AP District wise Updates

More
AP District wise updates

Follow by Email

To get updates from aptnusinfo.blogspot.com to your Email directly,Enter your email id and click submit button,Then a popup windo will open,then type the Captcha code,Then go t your mail inbox,a confirmation mail will be there, verify that.Next onwards when ever i post a new one automatically a mail will be sent you.
Top