CIBIL Score: లోన్ కావాలా? ముందు మీ సిబిల్ స్కోర్ చెక్ చేసుకోండి
ఉరుకుల పరుగుల జీవితం.. తీరిక లేని వృత్తి, ఉద్యోగాలు.. చాలిచాలని జీతాలతో చాలామంది సగటు ఉద్యోగులు ఇబ్బందులు పడుతూ జీవనం సాగిస్తున్నారు. ముఖ్యంగా పట్టణాల్లో, నగరాల్లో ఓ మాదిరి ఉద్యోగి జీవితమైతే ఆర్థిక సమస్యల మద్య కొట్టుమిట్టాడుతుంది. అప్పు తీసుకోవాలన్నా ఎక్కువ వడ్డీలతో వారి పరిస్థితి ఇంకా దిగజారే ప్రమాదముంది. బ్యాంకుల్లో రుణాలు పొందాలంటే సవాలక్ష రూల్స్ ఉంటాయి. ముఖ్యంగా సిబిల్ స్కోరు మెరుగ్గా ఉండాలి. లేదంటే రుణం తిరస్కరణకు గురయ్యే ప్రమాదముంది. ఎప్పుడైన రుణం కోసం బ్యాంకులకు వెళ్తే మీ సిబిల్ స్కోరు ఆధారంగా మీకు లోన్ ఇవ్వాలా లేదా అనేది నిర్దేశిస్తారు.
రుణాల గురించి మీకు అవగాహన ఉన్నట్లయితే సిబిల్ గురించి మీకు తప్పకుండా తెలిసే ఉంటుంది.
లోన్ కు దరఖాస్తు చేసేముందు సిబిల్ స్కోరు ఎలా ఉందో సరిచూసుకోవడం ఎంతో ముఖ్యం. మెరుగైన క్రెడిట్ స్కోరు మీ ఆర్థిక స్థితిలో కీలక పాత్ర పోషిస్తుంది. సిబిల్ స్కోరు తక్కువగా ఉన్నట్లయితే మీకు లోన్ వచ్చే అవకాశం తగ్గిపోతుంది.
ద క్రెడిట్ ఇన్ఫర్మేషన్ బ్యూరో లిమిటెడ్ లేదా సిబిల్ అనేది ఖాతాదారులకు లోన్‌కు సంబంధించింది. అంటే మీకు రుణం ఇవ్వాలా లేదా.. గతంలో మీ క్రెడిట్ బిహెవియర్ ఎలా ఉంది అని అంచనా వేసే మూడు అంకెల సంఖ్యను స్కోరు రూపంలో ఇస్తుంది. సిబిల్ స్కోరు రేంజ్ 300 నుంచి 900 మధ్యలో ఉంటుంది. అంటే తక్కువ స్థాయి(300) ఉంటే మీ లోన్ తిరస్కరణకు గురవ్వడమో లేదా ఎక్కువ వడ్డీకి రుణం దక్కడమో జరుగుతుంది. అదే ఎక్కువ స్థాయి(900) సిబిల్ స్కోరు ఉన్నట్లయితే తక్కువ వడ్డీకే రుణాన్ని పొందవచ్చు. క్రెడిట్ ఇన్ఫర్మేషన్ బ్యూరోను 2000వ సంవత్సరంలో ప్రారంభించారు. ఈ సంస్థ తన కార్యకలపాలను 2004 నుంచి ప్రారంభించింది. క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీల రెగ్యూలేషన్ చట్టం-2005 ప్రకారం సిబిల్ కాకుండా మరో మూడు క్రెడిట్ సమాచార సంస్థలు(సీఐసీ) ఉన్నాయి.
సాధారణంగా వ్యక్తిగత రుణం పొందాలనుకునేవాళ్లు సిబిల్ స్కోరును కనీసం 750 వరకు ఉంచుకోవాలి. అంతకంటే తగ్గితే లోన్ తిరస్కరణకు లేదా ఎక్కవ వడ్డీతో రుణం పొందే అవకాశముంటుంది. కాబట్టి గతంలో ఏమైనా లోన్లు తీసుకుని ఉంటే తప్పకుండా వాటిని చెల్లించి సిబిల్ స్కోరు మెరుగైన స్థితిలో ఉంచుకోవాలి.
1.సిబిల్ స్కోరు మీ గత రుణ ప్రవర్తనను, పనితీరును అంచనా వేస్తుంది.
2.ఇది మీరు పొందిన రుణాలను యాక్సెస్ చేస్తుంది.
3.అంతేకాకుండా మీ క్రెడిట్ గురించి బహిర్గతపరుస్తుంది.
సిబిల్ స్కోరును కనుగొనాలంటే ఆన్ లైన్ లో తనిఖీ చేయవచ్చు. అంతేకాకుండా మీకు వ్యక్తిగత రుణాలిచ్చే ఆర్థిక సంస్థలు కూడా ఈ సౌకర్యాన్ని కల్పిస్తాయి. కాబట్టి వీలైనంతవరకు మీ క్రెడిట్ స్కోరును వీలైనంత వరకు మెరుగైన స్థితిలో ఉంచుకోవాల్సిన ఆవశ్యకత ఉంది.

0 comments:
Post a comment