Central Cabinet Expansion - Changes in Ministries - Positions for Telugu Leaders?
కేంద్ర కేబినెట్ విస్తరణ - మంత్రుల శాఖల్లో మార్పులు - తెలుగు నేతలకు పదవులు?
భారతీయ జనతా పార్టీ కొత్తగా ప్రకటించిన జాతీయ కార్యవర్గంలో.. ఏకంగా డజను మందికిపైగా సీనియర్లను పక్కనపెట్టడం సంచలనంగా మారింది. బీజేపీ చీఫ్ జేపీ నడ్డా శనివారం తన టీమ్ ను ప్రకటించిన తర్వాత.. అందులో చోటు కోల్పోయిన పలువురు నేతలకు కేంద్ర కేబినెట్ లో బెర్తు దక్కనుందనే చర్చ మొదలైంది. ప్రస్తుతం కేంద్ర కేబినెట్ లో మంత్రులపై పనిభారం ఎక్కువగా ఉండటం, ఎన్డీఏ మిత్రులు పదవులకు రాజీనామా చేయడం తదితర కారణాల నేపథ్యంలో బలమైన వాదన వినిపిస్తోంది..
కేంద్ర కేబినెట్ విస్తరణ..
జాతీయ కార్యదర్శులుగా పదవులు కోల్పోయిన వాళ్లలో రాంమాధవ్, మురళీధర్ రావు, అనిల్ జైన్, సూరజ్ పాండేలాంటి కీలక నేతలు కూడా ఉండటం అందరినీ ఆలోచింపజేసింది. ఉమాభారతి, ఓమ్ మాథుర్, ప్రభాత్ ఝా, వినయ్ సహస్త్రబుద్ధే, శ్యామ్ జాజు, అవినాశ్ రాయ్ ఖన్నా లాంటి నేతలకు సైతం నడ్డా టీమ్ లో చోటు దక్కకపోవడం గమనార్హం. అయితే, ఈ నేతల్లో కొందరికి ప్రభుత్వ పదవులు దక్కబోతున్నాయని, ఆ మేరకు ప్రధాని మోదీ కేంద్ర కేబినెట్ ను విస్తరిస్తారని సమాచారం.
కొత్త కేబినెట్ ఎప్పుడంటే..
2019 సార్వత్రిక ఎన్నికల్లో రెండో సారి ఘనవిజయం సాదించి, ఏడాదిన్నర కావొస్తున్నది. రెండో టర్మ్ లో తొలిసారి చేపటనున్న కేబినెట్ విస్తరణలో కీలక మార్పులు తథ్యమని విశ్వసనీయ వర్గాలు పేర్కొన్నాయి. అయితే బీహార్ అసెంబ్లీ ఎన్నికలు పూర్తయిన తర్వాతే కేంద్ర కేబినెట్ విస్తరణ ఉంటుందని ఆ వార్గాలు తెలిపాయి. ఈ ప్రక్రియలో పశ్చిమ బెంగాల్, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళకు చెందిన నేతలకు మాత్రమే అవకాశం కల్పించబోతున్నట్లు సమాచారం. ఆ లెక్కన ఆంధ్రప్రదేశ్ కు చెందిన రాంమాధవ్ కు ఎక్కువ అవకాశాలున్నట్లు తెలుస్తోంది.
మంత్రుల శాఖల్లో మార్పులు..
మోదీ మంత్రివర్గంలో, ప్రధాని కాకుండా కేబినెట్ ర్యాంకు హోదాలో 22 మంది మంత్రులుంటే, అందులో ఎనిమిది మంది రెండు, అంతకంటే ఎక్కువ శాఖలను నిర్వహిస్తున్నారు. స్వతంత్ర హోదా కలిగిన కేంద్రమంత్రులు తొమ్మిది మంది ఉంటే, అందులో ఎనిమిది మంది రెండు కంటే ఎక్కువ శాఖలను చూసుకుంటున్నారు. దీంతో ఆయా శాఖల్లో ప్రధాని మోదీ ఆశిస్తోన్నంత వేగంగా పని జరగడం లేదు. కాబట్టే మంత్రులపై భారం తగ్గేలా ఇంకొంత మందిని కేబినెట్ లోకి తీసుకోవాలని ప్రధాని భావిస్తున్నట్లు సమాచారం. అంతేకాదు, విస్తరణ సమయంలోనే మంత్రుల శాఖలను కూడా మార్చేస్తారని తెలుస్తోంది. జాతీయ కార్యవర్గంలో చోటు కోల్పోయిన నేతలకు కేబినెట్ లో ప్రాధాన్యం దక్కొచ్చని బీజేపీ వర్గాల్లో చర్చ జరుగుతున్నది.

0 comments:
Post a comment