గాన గాంధర్వుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం ఆరోగ్యం కోసం అభిమానులు చేసిన ప్రార్థనలకు, డాక్టర్ల కృషికి ఫలితం కనిపిస్తుంది. ఆయన మెల్లమెల్లగా కోలుకుంటున్నారు. బాలు ఆరోగ్యం గురించి తరుచూ ఆయన తనయుడు చరణ్ కూడా వీడియోలు పోస్ట్ చేస్తూ వివరాలు తెలియజేస్తున్నారు. చరణ్ లేటెస్ట్గా వీడియోలో గుడ్ న్యూస్ చెప్పారు. బాలసుబ్రమణ్యం కోలుకుంటున్నారని, ఆహారం కూడా తీసుకుంటున్నట్లు తెలిపారు. 15నిమిషాల పాటు ఆయన లేచి కూర్చుంటున్నారని వివరించారు. ఊపిరితిత్తుల పనితీరు మెరుగుపడిందని, ఫిజియో థెరపీ కూడా చేస్తున్నట్లు తెలిపారు.
0 comments:
Post a comment