Union Health Minister's key remarks on corona vaccine ...
కరోనా వాక్సిన్ పై కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి కీలక వ్యాఖ్యలు...
కరోనా వాక్సిన్ విషయంలో ఇండియా దూకుడును ప్రదర్శిస్తున్నది. ఇండియాకు చెందిన మూడు సంస్థలు వాక్సిన్ తయారీలో నిమగ్నమై ఉన్నాయి. ఇప్పటికే ఈ మూడు సంస్థలు తయారు చేస్తున్న వాక్సిన్ లు క్లినికల్ దశల్లో ఉన్నాయి. వచ్చే ఏడాది మార్చి వరకు ఇండియాలో వాక్సిన్ ను రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నది. ఇక వాక్సిన్ పై ఈరోజు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. వాక్సిన్ ప్రయోగాల అనంతరం తొలి వాక్సిన్ ను తీసుకోవడానికి ఎవరూ ముందుకు రాకుంటే తాను ముందుకు వచ్చి వాక్సిన్ తీసుకుంటానని అన్నారు. ఇండియన్ వాక్సిన్ పై తనకు పూర్తి భరోసా ఉందని అన్నారు. ఇండియాలో ఫిబ్రవరి మార్చి వరకు వాక్సిన్ అందుబాటులోకి వస్తుందని అన్నారు.
భారత్ లో కరోనా రికవరీ కేసులు ప్రపంచదేశాలతో పోలిస్తే అత్యధికంగా ఉన్నట్టు కేంద్రమంత్రి హర్షవర్ధన్ పేర్కొన్నారు.

0 comments:
Post a comment