కరోనా విజృంభణ నేపథ్యంలో మాస్క్ ధరించడం తప్పనిసరి. ఇంటి నుంచి బయటకు వచ్చేటప్పుడు ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా మాస్క్ ధరించాలని కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలు చెబుతున్నాయి. మాస్క్ పెట్టుకోని వారికి భారీగా జరిమానాలు కూడా విధిస్తున్నాయి. ఐతే కార్లు, బైక్‌లపై ఒంటరిగా ప్రయాణించే వారు మాస్క్ పెట్టుకోవాలా? వద్దా? ఇదే డౌట్ చాలా మందికి వచ్చింది. తాము ఒంటరిగానే వెళ్తున్నాం కదా.. మాస్క్ పెట్టుకోకుంటే ఏమవుతుంది? మా వల్ల ఎవరికి ప్రమాదం ఉంది? అసలు ఎందుకు చలాన్లు వేస్తున్నారని పోలీసులను నిలదీస్తున్నారు. డ్రైవింగ్‌లో మాస్క్ పెట్టుకోని వారికి పోలీసులు జరిమానాలు విధిస్తుండడంతో చాలా మంది ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు.
ఈ నేపథ్యంలో దీనిపై క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది కేంద్ర ఆరోగ్యశాఖ.
కారు, బైక్, సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించే వారు తప్పనిసరిగా మాస్క్ పెట్టుకోవాల్సిందిగా ఎలాంటి మార్గదర్శకాలను జారీచేయలేదని కేంద్ర ఆరోగ్యశాఖ సెక్రటరీ రాజేష్ భూషణ్ మీడియాకు తెలిపారు ఐతే కొంత మంది కలిసి గ్రూప్‌గా జాగింగ్ చేసినా.. సైక్లింగ్‌కు వెళ్లినా.. కారులో ఎక్కువ మంది ఉన్నా.. ఖచ్చితంగా మాస్క్ ధరించాలని స్పష్టం చేశారు. అలాంటి సమయంలో మాస్క్ ధరించడమే గాక భౌతిక దూరం పాటించాలని చెప్పారు. లేదంటే ఒకరి నుంచి మరొకరికి వైరస్ సంక్రమించే ప్రమాదముందని వెల్లడించారు.గురువారం నాటి కరోనా మీడియా బులెటిన్ ప్రకారం.. భారత్‌లో ఇప్పటి వరకు 38,53,406 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనాను జయించి 29,70,492 మంది పూర్తిగా కోలుకున్నారు. వైరస్‌తో పోరాడుతూ 67,376 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం మనదేశంలో 8,15,538 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. భారత్‌లో ఇప్పటి వరకు 4 కోట్ల 55 లక్షల 9,380 మందికి కరోనా పరీక్షలు నిర్వహించినట్లు కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ తెలిపింది. మనదేశంలో మహారాష్ట్రలోనే అత్యధిక కరోనా కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాతి స్థానాల్లో ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్నాటక, యూపీ రాష్ట్రాలున్నాయి.

0 comments:
Post a comment