కరోనాతో కేంద్ర మంత్రి కన్నుమూత
దిల్లీ: కేంద్ర రైల్వేశాఖ సహాయ మంత్రి సురేశ్ అంగడి కన్నుమూశారు. ఇటీవల కరోనా బారినపడిన ఆయన దిల్లీ ఎయిమ్స్‌లో చికిత్సపొందుతూ బుధవారం రాత్రి తుదిశ్వాస విడిచారు. కర్ణాటకలో ఇటీవల భాజపా ఎంపీ అశోక్ గస్తీ కరోనాతో మృతిచెందగా.. తాజాగా బెళగావి లోక్‌సభ సభ్యుడు సురేశ్ అంగడి ప్రాణాలు కోల్పోవడంతో విషాదం నెలకొంది. కరోనాతో మృతిచెందిన తొలి కేంద్రమంత్రి సురేశ్ అంగడి కావడం గమనార్హం. బెళగావి లోక్‌సభ నియోజకవర్గం నుంచి నాలుగు పర్యాయాలు ఆయన ఎంపీగా గెలుపొందారు.
నేపథ్యం ఇదీ..
కర్ణాటకలోని బెళగావి జిల్లాలోని కేకే కొప్ప గ్రామంలో చెనబసప్ప అంగడి, సోమవ్వ అంగడి దంపతులకు 1955 జూన్ 1న సురేశ్ జన్మించారు.

0 comments:
Post a comment