ఐరాసపై నిప్పులు చెరిగిన మోదీ - నిర్ణయాత్మక స్థానం కోసం భారత్ ఇంకా ఎన్నాళ్లు ఆగాలి?
మారిన పరిస్థితులకు అనుగుణంగా ఐక్యరాజ్యసమితి కూడా తన విధివిధానాలు, ప్రాధాన్యతలను మార్చుకోవాల్సిన అవసరం ఉందని భారత ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఐరాస సంస్కరణలకు సమయం వచ్చిందని, ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్యదేశమైన భారత్ ను ఐరాస విస్మరించడం తగదని, ఇంకా ఎన్నాళ్లు నిర్ణయాత్మక స్థానం నుంచి ఇండియాను దూరం పెడతారని ఆయన ప్రశ్నించారు. ఐక్యరాజ్యసమితి సాధారణ అసెంబ్లీ 75వ సెషన్ లో భాగంగా శనివారం కీలక ప్రసంగం చేసిన ఆయన ఐరాస తీరుపై అసహనాన్ని వెళ్లగక్కారు. అదే సమయంలో ప్రపంచ మానవాళికి భారత్ చేస్తోన్న సాయాన్ని గుర్తుచేశారు. మోదీ ప్రసంగం ఆయన మాటల్లోనే ''ఐరాస సభ్యదేశాల్లో భారత్ కూడా ఒకటిగా ఉన్నందుకు గర్వంగా ఉంది. ఈ సందర్భంగా 130 కోట్ల మంది భారతీయుల భావనను నేను వ్యక్తం చేస్తున్నాను. 75 ఏళ్ల కిందట ఐరాస ఏర్పడిన సందర్భంలో పరిస్థితులు వేరుగా ఉండేవి. అయితే ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. 21 శతాబ్దం అవసరాలకు తగ్గట్లుగా ఐరాస విధానాలు సైతం మారాల్సిన అవసరం ఉంది. మార్పును మనం స్వీకరించకుంటే మనుగడ కష్టసాధ్యమవుతుంది. గడిచిన దశాబ్దాల్లో ఐరాస అద్భుతమైన పనితీరును కనబర్చినా, కొన్ని కీలక విషయాలను పరిష్కరించడంలో చొరవ చూపలేదనే చెప్పాలి.
మూడో ప్రపంచ యుద్ధం రాకున్నా..
పేరుకు మూడో ప్రపంచ యుద్ధం రానప్పటికీ.. వివిధ దేశాల్లో నెత్తుటేర్లు పారాయి. ఉగ్రవాదం అనే భూతం దేశాలను వణికించింది. ఉగ్రరక్కసికి బలైపోయినవారిలో లక్షలాది మంది చిన్నారులు కూడా ఉన్నారు. కోట్ల మంది ఇళ్లు వదిలేసి వెళ్లాల్సి వచ్చింది. ఈ సమస్యల్ని ఐరాస పరిష్కరించగలిగిందా అని అవలోకనం చేసుకోవాలి.
కరోనా వేళ ఐరాస ఏం చేసింది?
ఇక ప్రస్తుతం కొనసాగుతోన్న కరోనా విలయం విషయానికి వస్తే.. దేశాలన్నీ గడగడలాడుతోంటే.. ఐక్యారాజ్యసమితి ఏం చేస్తున్నది? తన పాత్రను సమర్థవంతంగా నిర్వహించిందా? అందుకే నేను మళ్లీ చెబుతున్నాను.. ఐరాస విధివిధానాలు, పనితీరులో కచ్చితంగా మార్పు రావాల్సిందే. మొత్తంగా ఐరాస స్వరూపం మారాల్సిన ఆవశ్యకత ఏర్పడింది.
భారత్ పట్ల మీ తీరు మార్చుకోండి..
ఇతర దేశాలకంటే మిన్నగా భారత్.. ఐరాస పట్ల గౌరవమర్యాదల్ని ప్రదర్శించింది. కానీ ఐరాసలో మార్పు కోసం భారత్ సుదీర్ఘంగా వేచిచూస్తున్నదన్న విషయాన్ని మీరు గుర్తెరగాలి. నిర్ణయాత్మకంగా వ్యవహారాల నుంచి భారత్ ను ఇంకా ఎన్నిరోజులు దూరం పెడతారు? భద్రతా మండలిలో సభ్యత్వం కోసం భారత్ ఇంకా ఎన్నాళ్లు ఎదురు చూడాలి? దీనిపై 130 కోట్ల భారతీయులు నిజంగా అసంతృప్తిగా ఉన్నారు. ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామిక దేశంగా, అతి పెద్ద జనాభా ఉన్న దేశంగా, వందలాది భాషలు, భిన్నభావనలతో కూడిన భారత్.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు వెన్నుదన్నుగా ఉందన్న విషయం మర్చిపోతే ఎలా?'' అని ప్రధాని మోదీ ప్రశ్నించారు.

0 comments:
Post a comment