రమేష్ ఆస్పత్రి ఘటనపై హైకోర్టు ఆదేశాలను సుప్రీంకోర్టులో సవాల్ చేయాలని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నిర్ణయించింది... రమేష్ ఆస్పత్రి ఎండీ రమేష్ బాబు, చైర్మన్ సీతారాంమోహన్‌పై తదుపరి చర్యలు తీసుకోవద్దని ఏపీ హైకోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే... కోవిడ్ సెంటర్‌కు అనుమతిఇచ్చిన అధికారులను కూడా తప్పుబట్టింది హైకోర్టు.. దీంతో.. దీనిపై సుప్రీంకు వెళ్లనుంది ఏపీ ప్రభుత్వం. కాగా, డాక్టర్ రమేష్ క్వాష్ పిటిషన్‌పై ఈమధ్యే విచారణ జరిపిన హైకోర్టు.. డాక్టర్ రమేష్‌తో పాటు ఆస్పత్రి ఛైర్మన్‌పై తదుపరి చర్యలు తీసుకోకుండా మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. అసలు స్వర్ణ ప్యాలెస్‌ను క్వారంటైన్ సెంటర్‌గా అనుమతిచ్చిన కలెక్టర్, సబ్ కలెక్టర్, అధికారులను ఎందుకు బాధ్యులను చేయకూడదని ఈ సందర్భంగా హైకోర్టు ప్రశ్నించింది.
ఈ కేసులో అధికారులను నిందితులుగా చేరుస్తారా? అని ప్రశ్నించింది. ఇందులో అధికారుల తప్పు కూడా ఉందని.. ఘటనకు వారు కూడా బాధ్యులేనని స్పష్టం చేసింది హైకోర్టు. మరి సర్కార్ సుప్రీంకోర్టుకు వెళ్తే.. ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయి అనేది ఆసక్తికరంగా మారింది.
0 comments:
Post a comment