బీహార్ లోని గయకు సుమారు 80 కి.మీ. దూరంలో ఉంది కొథిలావా అనే చిన్న గ్రామం.. అక్కడ ఎండిపోతున్న తన పొలానికి నీటిని మళ్లించేందుకు లాంగీ భూయాన్ అనే వ్యక్తి 'అపర భగీరథుడే' అయ్యాడు. గ్రామానికి సమీపంలోనే ఉన్న కొండలు, గుట్టల నుంచి వాన నీటిని తన పొలానికి తరలించేందుకు 30 సంవత్సరాలుగా అలుపెరగకుండా శ్రమిస్తూ 3 కి.మీ. కాలువ తవ్వాడు. ఇన్నేళ్లూ తాను దగ్గరలోని అడవుల్లోకి వెళ్తూ..ఒక్కడినే పలుగూ, పారా పట్టుకుని కాలువ తవ్వుతూ వచ్చానని. గ్రామస్తుల్లో ఎవరూ తనతో చేతులు కలపలేదని ఆయన చెప్పాడు. తన గ్రామంలోని వారంతా మనుగడ కోసం నగరాలకు, పట్టణాలకు వెళ్లారని, కానీ తను మాత్రం ఇక్కడే ఉండాలని నిర్ణయించుకున్నానని భూయాన్ తెలిపాడు.
వర్షాకాలంలో కొండల నుంచి కిందికి ప్రవహించే నీరంతా వృధాగా నదిలో కలుస్తుందని. ఆ నీరు అలా వృధా కాకుండా ఇలా కాలువ తవ్వానని ఈ 'అపర భగీరథుడు' తెలిపాడు. ఇంత జరిగినా ఇతని గ్రామంలో ఒక టీచర్ తప్ప మిగిలినవారెవరూ ఇతని కృషిని పట్టించుకోలేదు.
0 comments:
Post a comment