దేశంలోని అత్యంత విశ్వసనీయ బీమా సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసి) పిల్లల కోసం ఒక కొత్త ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. 'న్యూ చిల్డ్రన్స్ మనీ బ్యాక్ ప్లాన్'గా పిలిచే ఈ ప్లాన్ ప్రత్యేకంగా 0 నుంచి 25 ఏళ్ల మధ్య ఉన్న పిల్లలను దృష్టిలో పెట్టుకొని రూపొందించింది. 0 నుంచి 25 ఏళ్ల మధ్య ఉన్న పిల్లల విద్య, వివాహం, ఇతర అవసరాలను తీర్చడానికి ఈ పాలసీ ఎంతో ఉపయోగపడుతుంది. ఈ ప్లాన్‌లో చేరితే మెచ్యూరిటీ బెనిఫిట్స్‌తో పాటు అదనపు ప్రయోజనాలు కూడా లభిస్తాయి. అంతేకాక, ఈ ప్లాన్ 25 సంవత్సరాల వయస్సు వచ్చే వరకు పిల్లలకు ఆర్థిక భద్రతను అందిస్తుంది. ఈ బీమా పాలసీలో చేరాలంటే మీ పిల్లల వయస్సు 0 నుంచి 12 సంవత్సరాల మధ్య ఉండాలి.
ఈ పాలసీని తల్లిదండ్రులు లేదా గ్రాండ్ పేరెంట్స్ ఎవరైనా కొనుగోలు చేయవచ్చు.
సర్వైవల్ బెనిఫిట్స్పాలసీలో భాగంగా వరుసగా 18 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 22 సంవత్సరాలు పూర్తయిన తర్వాత పాలసీ దారునికి వరుసగా బేసిక్ సమ్ అస్యూరిడ్ అమౌంట్లో 20 శాతం చొప్పున చెల్లిస్తారు.
మెచ్యూరిటీ పీరియడ్ అండ్ బెనిఫిట్స్
పాలసీ వ్యవధి 25 సంవత్సరాల వయస్సు వచ్చే వరకు ఉంటుంది. అనగా మీ పిల్లల వయస్సు 0 నుంచి 25 ఏళ్ల మధ్య ఉన్నప్పుడు ఈ పాలసీలో ఎప్పుడు చేరినప్పటికీ 25 ఏళ్లు రాగానే పాలసీ ముగుస్తుంది. పాలసీ అమలులో ఉన్న సమయంలో పాలసీదారుడు మరణిస్తే నామినీకి బోనస్‌తో సహా బేసిక్ సమ్ అస్యూరిడ్ అమౌంట్లో 40 శాతం రిటన్కు హామీ లభిస్తుంది. కాగా మినిమం బేసిక్ సమ్ అస్యూర్డ్ మొత్తం రూ .1 లక్ష, మ్యాగ్జిమం బేసిక్ సమ్ అస్యూర్డ్ ఎటువంటి పరిమితి లేదు.
ప్రీమియం పేమెంట్స్
పాలసీ అమల్లో ఉన్న కాలానికి ప్రీమియంలను క్రమం తప్పకుండా వార్షిక, అర్ధ -వార్షిక, త్రైమాసిక లేదా నెలవారీ పద్ధతిలో చెల్లించవచ్చు. ఎంచుకున్న కాలానికి గాను పాలసీ ప్రీమియం చెల్లించడానికి 30 రోజుల గ్రేస్ పీడియడ్ ఉంటుంది. గ్రేస్ పీరియడ్ పూర్తయ్యే లోపు ప్రీమియం చెల్లించకపోతే పాలసీ రద్దు అయ్యే అవకాశం ఉంటుంది.గ్రేస్ పీరియడ్లోపు ప్రీమియం మొత్తాన్ని చెల్లించకపోతే పాలసీ రద్దు అవుతుంది. అయితే, ఓ సారి రద్దు అయిన పాలసీని మళ్లీ ఐదేళ్ల లోపు పునఃప్రారంభం చేసుకోవచ్చు. అప్పటి వరకు బకాయి ఉన్న అన్ని ప్రీమియంలను చెల్లించి పునరుద్ధరించుకోవచ్చు. అన్ని బకాయిలు వడ్డీతో సహా చెల్లించిన తదుపరి పాలసీ మళ్లీ అమల్లోకి వస్తుంది.

0 comments:
Post a comment