Are you snoring ..? Follow this tips .. will shrink ..!
గురక పెడుతున్నారా..? ఈ చిన్న చిట్కా పాటించండి.. తగ్గిపోతుంది..!
మనల్ని, మన పక్క వారిని ఎక్కువగా చిరాకు పెట్టే సమస్య గురక. మనకు తెలియకుండానే మన గురకతో పక్క వారిని చాలా ఇబ్బంది పెడుతుంటాం. మన దగ్గర పడుకోవాలంటేనే భయపడేలా చేస్తాం. కానీ, మనం గురక పెడుతున్నట్లు ఎవరైనా చెప్పే వరకు మనకు కూడా తెలియదు. మనకు తెలియకుండా పెట్టే గురకను ఎలా తగ్గించుకోవాలో కూడా మనకు అర్థం కాదు. కానీ, గురక తగ్గడానికి కూడా కొన్ని చిట్కాలు ఉన్నాయి. ఇవి పాటిస్తే గురకను తగ్గించుకోవచ్చు. పక్క వారిని హాయిగా నిద్రపోయేలా చేయవచ్చు. ఆ చిట్కాలు ఏమిటో మీరూ చూడండి.. పాటించండి.
గురక ఎక్కువగా లావు ఉన్నవారికి వస్తుంది. కడుపు నిండా తిని వెంటనే పడుకునే వారికి కూడా గురక ఎక్కువగా వస్తుంది. ఎందుకు ఇలా జరుగుతుందని తెలుసుకోవడం రాకెట్ సైన్స్ లాంటి కష్టమైన పని ఏమీ కాదు.
లావుగా ఉన్న వారికి శరీరంలో కొన్ని కోట్ల జీవకణాలు ఉండాల్సిన దాని కంటే ఎక్కువగా ఉంటాయి. ఇవి జీవించడానికి కూడా మనం పీల్చుకునే గాలే ఆధారం. పగటి వేళల్లో మన శరీరం కదులుతూ ఉంటుంది కాబట్టి ఊపిరితిత్తులు శరీరానికి కావాల్సిన గాలి బాగానే అందిస్తుంది.
కానీ, రాత్రి వేళల్లో శరీరం కదలదు. దీంతో ఊపిరితిత్తులు సాధారణం కంటే తక్కువగా పని చేస్తాయి. ఇక్కడ మరో సమస్య ఏంటంటే కడుపు నిండుగా తిని వెంటనే పడుకుంటే పొట్ట బరువు ఊపిరితిత్తులను కొంత వరకు మూసి అవి సరిగ్గా పని చేయకుండా చేస్తాయి. దీంతో శరీరానికి కావాల్సిన గాలి అందదు. అప్పుడు ముక్కుతో పీల్చుకునే గాలి సరిపోక నోటితో కూడా గాలి పీల్చుకోవాల్సి వస్తుంది. నోటితో గాలి తీసుకోవడం వల్లనే గురక కూడా ఎక్కువగా వస్తుంటుంది.
కేవలం మూడు చిట్కాలను సరిగ్గా పాటిస్తే గురక 15 రోజుల్లో పూర్తిగా తగ్గిపోతుంది. గురక పెట్టే వారు వారి టైమింగ్స్‌ను పూర్తిగా మార్చుకోవాలి. రాత్రి 10 గంటలకు తినేసి వెంటనే పడుకోవడం మానేయాలి. సాయంత్రం 7 గంటలకే రాత్రి భోజనం తినేయాలి. ఇలా చేయడం ద్వారా రాత్రి 10 గంటలకు పడుకునే లోపు ఆహారంలో చాలా వరకు అరిగిపోతుంది. అప్పుడు పొట్ట ఖాళీగా ఉంటుంది. ఊపిరితిత్తులు బాగా పని చేస్తాయి.
రాత్రి వేళల్లో అన్నం, ఉడికించిన ఇతర ఆహారాన్ని ఎక్కువ మోతాదులో తినడం కూడా మానేయాలి. రాత్రి పూట వీలైనంత తక్కువ తినడం మంచిది. అది కూడా ఉడికిన ఆహారం కాకుండా పండ్లు తినడం అలవాటు చేసుకోవాలి. ఇలా చేయడం ద్వారా శ్వాసక్రియ మెరుగ్గా జరుగుతుంది. గురకతో పాటు సకల అనారోగ్య సమస్యలకు ప్రధాన కారణం బరువు. బరువును తగ్గించుకుంటే గురక కూడా దానికదే పూర్తిగా తగ్గిపోతుంది.

0 comments:
Post a comment