Amaravati: మూడు రాజధానులు ఉండొచ్చు.. కేంద్రం క్లారిటీ...
మూడు రాజధానులపై హైకోర్టులో కేంద్రం అదనపు అఫిడవిట్ దాఖలు చేసింది. ఈ అఫిడవిట్లో కేంద్రం పలు కీలక అంశాలను ప్రస్తావించింది. రాజధానుల్లో కేంద్రం పాత్రపై హోంశాఖ మరింత స్పష్టత ఇచ్చింది. ఒకే రాజధాని ఉండాలని విభజన చట్టంలో ఎక్కడా లేదని కేంద్రం పేర్కొంది. సెక్షన్ 13 ప్రకారం రాజధాని ఆంటే ఒకటికే పరిమితం కావాలని కాదని అని క్లారిటీ ఇచ్చింది. 2018లో అప్పటి ప్రభుత్వం అమరావతిలో హైకోర్టు పెట్టిందన్న కేంద్రం.. హైకోర్టు ఉన్నంత మాత్రాన అమరావతినే రాజధాని అని చెప్పలేమని తెలిపింది. రాజధానికి కేంద్రం ఆర్థిక సహాయం మాత్రమే చేస్తుందని.. రాజధాని అంశంపై రాష్ట్ర ప్రభుత్వానిదే అంతిమ నిర్ణయమని మరోసారి స్పష్టం చేసింది. దీనిపై పిటిషనర్ దోనె సాంబశివరావువి అపోహలేనని కేంద్రం అఫిడవిట్లో పేర్కొంది.

0 comments:
Post a comment