The Reserve Bank of India (RBI) has recently provided sweeteners to farmers and traders. Priority sector lending also extends its advantage to startups. As part of this, startups have the opportunity to borrow up to Rs 50 crore. Not only startups but also farmers have a chance to benefit. Farmers can also avail loans under this scheme for setting up of solar plants and compressed biogas plants
రైతులకు, వ్యాపారులకు ఆర్బీఐ తీపికబురు..
రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) తాజాగా రైతులకు, వ్యాపారులకు తీపికబురు అందించింది. ప్రియారిటీ సెక్టార్ లెండింగ్ ప్రయోజనాన్ని స్టార్టప్స్కు కూడా విస్తరించింది. ఇందులో భాగంగా స్టార్టప్స్ రూ.50 కోట్ల వరకు రుణం పొందే అవకాశం అందుబాటులోకి వచ్చింది. కేవలం స్టార్టప్స్ మాత్రమే కాకుండా రైతులు కూడా ప్రయోజనం పొందే ఛాన్స్ ఉంది. సోలార్ ప్లాంట్స్, కాంప్రెస్డ్ బయో గ్యాస్ ప్లాంటు వంటి వాటి ఏర్పాటుకు రైతులు కూడా ఈ ప్రయోజనం కింద రుణాలు పొందొచ్చు. ప్రియారిటీ సెక్టార్ లెండింగ్ నిబంధను సమీక్షించిన ఆర్బీఐ శుక్రవారం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.ప్రియారిటీ సెక్టార్ లెండింగ్ నిబంధనలను సరళీకరించిన తర్వాత ఇప్పుడు రైతుు, బలహీన వర్గాలు సులభంగానే రుణం పొందొచ్చని ఆర్బీఐ తెలిపింది.
అలాగే రెన్యూవబుల్ ఎనర్జీ, హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విభాగాలకు కూడా అధిక రుణ మంజూరీకి ప్రయత్నిస్తున్నామని పేర్కొంది. బ్యాంకులు స్టార్టప్స్కు ప్రియారిటీ సెక్టార్ లెండింగ్ కింద రూ.50 కోట్ల వరకు రుణాలు అందిస్తాయని ఆర్బీఐ తెలిపింది. క్షేత్ర స్థాయిలో కూడా ఈ ప్రయోజనాన్ని అర్హులకు అందిస్తామని పేర్కొంది. రైతులకు కొత్త బిజినెస్ ఏర్పాటుకు కూడా రుణాలు పొందొచ్చని తెలిపింది. కొన్ని జిల్లాలకు కూడా ఈ ప్రయోజనాన్ని అందిస్తామని పేర్కొంది.

0 comments:
Post a comment